Republic Day: గణతంత్ర వేడుకల్లో వారికి అనుమతి లేదు: దిల్లీ పోలీస్‌

మరో రెండ్రోజుల్లో దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ఏటా దిల్లీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్‌ నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రాదాయాలను ప్రతిబింబించేలా పలు షకటాల ప్రదర్శన, సైన్యం కవాతులు వీక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే, ఈ వేడుకలను

Updated : 23 Jan 2024 16:21 IST

దిల్లీ: మరో రెండ్రోజుల్లో దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. దీనిలో భాగంగా దిల్లీలో పరేడ్‌ నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రాదాయాలను ప్రతిబింబించేలా పలు శకటాలు, సాయుధ బలగాల కవాతులు వీక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే, ఈ వేడుకలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు దిల్లీకి వస్తుంటారు. అయితే, కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో దిల్లీ పోలీసులు పరేడ్‌ చూసేందుకు వచ్చే ప్రజలకు పలు ఆంక్షలు విధించారు. 15 ఏళ్ల లోపు చిన్నారులు, వ్యాక్సినేషన్‌ పూర్తికాని వారిని పరేడ్‌ చూసేందుకు అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు.

‘‘కరోనా నిబంధనలను పాటిస్తూనే గణతంత్ర దినోత్సవ వేడుకల్ని విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా.. 15 ఏళ్ల వయసులోపు చిన్నారులకు, రెండు డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోని వారికి అనుమతి లేదు. వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారు.. సంబంధిత ధ్రువీకరణ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి’’అని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ ఏడాది దేశరాజధానిలో జరిగే గణతంత్ర వేడుకల ప్రధాన కార్యక్రమంలో 16 కవాతు విభాగాలు కనువిందు చేయనున్నాయి. ఇవి రాజ్‌పథ్‌పై ఠీవిగా ముందుకు సాగుతూ వీక్షకులను ఆకట్టుకోనున్నాయి. వీటిలో సైన్యం, నౌకాదళం, వాయుసేన, కేంద్ర సాయుధ బలగాలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలు భాగస్వామ్యం కానున్నాయి. అలాగే 17 సైనిక బ్యాండ్‌లు, 25 శకటాలు కనువిందు చేయనున్నాయి. మరోవైపు ఈ వేడుకలను నిర్వహించే ప్రాంతంలో 27వేల మంది భద్రత బలగాలు మోహరించాయి. గగనతలంలో భద్రత కోసం పోలీసులు డ్రోన్‌ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. డ్రోన్ల సాయంతో అవాంఛిత ఘటనలు చోటు చేసుకోకుండా పహారా కాయనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని