తెలివిలేనివాళ్లే వ్యాక్సిన్లను శంకిస్తున్నారు!

అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ)  అనుమతిచ్చిన వ్యాక్సిన్ల సమర్థతను శంకించినవారిని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ మందబుద్ధిమంతులతో పోల్చారు. సూరత్‌లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మేంద్ర ప్రదాన్‌ మాట్లాడుతూ.. స్వేదేశీ పరిజ్ఞానంతో,,,

Published : 05 Jan 2021 02:23 IST

కాంగ్రెస్‌పై మండిపడిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

సూరత్‌: అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ)  అనుమతిచ్చిన వ్యాక్సిన్ల సమర్థతను శంకించినవారిని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ బుద్ధిమాంద్యం ఉన్నవారితో పోల్చారు. సూరత్‌లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మేంద్ర ప్రదాన్‌ మాట్లాడుతూ.. స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్ల అభివృద్ధిని చూసి వారంతా ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి విమర్శించారు. దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ- సీరం ఇన్‌స్టిట్యూట్ కలిసి‌ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను మూడో విడత ప్రయోగ ఫలితాలను పరిశీలించక ముందే వినియోగానికి అనుమతివ్వడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టిన విషయం తెలిసిందే.

ఈ అంశంపై తాజాగా ధర్మేంద్ర ప్రదాన్‌ స్పందించారు. ‘‘ బుద్ధిమాంద్యం ఉన్నవారు, శాస్త్రవేత్తలపై నమ్మకం లేనివారే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తారు’’ అని మండిపడ్డారు.  ఈ వ్యాక్సిన్లు దేశీయ ఔషధ సంస్థలు, భారతీయ శాస్త్రవేత్తల నిరంతర కృషి ఫలితమని అన్నారు. వ్యాక్సిన్ల అభివృద్ధిలో ప్రధాని మోదీ చొరవను దేశ ప్రజలంతా కొనియాడుతున్నారని, కానీ, కొంత మంది బుద్ధిలో మాత్రం మార్పు రావడం లేదని విమర్శించారు. ప్రధానంగా కాంగ్రెస్‌ నేతల ఆలోచన విధానంలో మార్పు రావాలని ఆయన అన్నారు. ప్రతి విషయాన్ని వక్రమార్గంలో ఆలోచించడం మానుకోవాలని హితవు పలికారు.

ఇవీ చదవండి

భారత్‌లో కరోనా కొత్తరకం కేసులు @ 38

కొవాగ్జిన్‌ వైపు ప్రపంచ దేశాల చూపు..!

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts