గాంధీ జయంతి రోజు ‘గాడ్సే జిందాబాద్‌’.. ఎంపీ వరుణ్‌ గాంధీ ఫైర్‌!

మహాత్మగాంధీ జయంతి రోజు ఆయనను హతమార్చిన నాథూరాం గాడ్సేను కీర్తిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పెట్టిన వారిపై భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ మండిపడ్డారు.

Updated : 02 Oct 2021 18:48 IST

దిల్లీ: మహాత్మగాంధీ జయంతి రోజు ఆయనను హతమార్చిన నాథూరాం గాడ్సేను కీర్తిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పెట్టిన వారిపై భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ మండిపడ్డారు. దేశాన్ని అవమానిస్తున్నారని, అలాంటి వారిని బహిరంగంగా అవమానించాలని పేర్కొన్నారు. మహాత్మగాంధీ జయంతి రోజున ‘గాడ్సే జిందాబాద్‌’ అంటూ కీర్తిస్తూ కొందరు ట్వీట్‌లు చేయడంపై ఆయన ఈ విధంగా స్పందించారు.

భారత్‌ ఎప్పుడూ ఆధ్యాత్మిక శక్తిగా ఉందని, దాన్ని మహాత్ముడు ప్రపంచానికి చాటాడని వరుణ్‌ గాంధీ శనివారం ట్వీట్‌ చేశారు. దేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపారని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి వ్యక్తి జయంతి రోజున కొందరు గాడ్సే జిందాబాద్‌ అని కీర్తించడం ద్వారా దేశాన్ని అవమానిస్తున్నారని వరుణ్‌ గాంధీ మండిపడ్డారు. అలాంటి ఉన్మాదులను ప్రధాన స్రవంతిలోకి అనుమతించకూడదన్నారు. వారిని బహిరంగంగా దండించాలన్నారు. మహాత్ముడి జయంతి సందర్భంగా దేశమంతా ఆయనను స్మరించుకుంటున్న వేళ.. ఒక వర్గం వ్యక్తులు నాధూరాం గాడ్సేను కీర్తిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో గాంధీ జయంతితో పాటు, గాడ్సే కూడా ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో వరుణ్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేస్తూ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని