దేశ విభజన కారకులకు సిలబస్‌లో స్థానం ఉండకూడదు: డీయూ
దిల్లీ విశ్వవిద్యాలయం(Delhi University) తన కరికులమ్‌లో భారీ మార్పు చేపట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఓ ప్రకటన జారీ చేసింది.
దిల్లీ: దేశవిభజనకు పునాది వేసిన వ్యక్తులకు సిలబస్‌లో స్థానం ఉండకూడదని దిల్లీ విశ్వవిద్యాలయం ఉపకులపతి యోగేశ్ సింగ్( Delhi University Vice Chancellor Yogesh Singh) అన్నారు. రాజనీతిశాస్త్రం సిలబస్ నుంచి పాకిస్థాన్ కవి మహ్మద్ ఇక్బాల్(Muhammad Iqbal)పై ఉన్న పాఠ్యభాగాన్ని తొలగించేందుకు విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ ఒక తీర్మానాన్ని పాస్‌చేసింది. ఈ క్రమంలో యోగేశ్ సింగ్ స్పందించారు.
‘భారత విభజన ఆలోచన, పాకిస్థాన్ ఏర్పాటు గురించి మొదట లేవనెత్తిన వ్యక్తి ఇక్బాల్. వారికి బదులు మన జాతి హీరోల గురించి తెలుసుకుందాం. భారత విభజనకు పునాది వేసిన వ్యక్తులు మన సిలబస్‌లో భాగం కాకూడదు’అని యోగేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. అత్యంత ప్రజాదరణ పొందిన ‘సారే జహాసే అచ్చా’ పాటను రాసింది మహ్మద్ ఇక్మాల్. ఆయన 1877లో అవిభాజ్య భారత్‌లోని సియాల్‌కోటలో జన్మించారు. ప్రత్యేక పాకిస్థాన్ ఏర్పాటు ఆలోచనకు మూలం ఇక్బాల్ అని చెప్తారు.
ఇదిలా ఉంటే..‘మోడర్న్ ఇండియన్ పొలిటికల్ థాట్’ పేరిట ఉన్న ఛాప్టర్ తొలగించేందుకు దిల్లీ విశ్వవిద్యాలయం శుక్రవారం అకడమిక్ కౌన్సిల్ తీర్మానాన్ని ఆమోదించింది. యోగేశ్ ప్రతిపాదించిన తీర్మానంపై శుక్రవారం ఉదయం నుంచి 15 గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశం అనంతరం విశ్వవిద్యాలయం ప్రకటన చేసింది. ఆయన తీర్మానాన్ని అకడమిక్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు అధికారులు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం తుదినిర్ణయం కోసం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందు ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vishal: రూ. 6.5 లక్షలిచ్చా.. సెన్సార్ బోర్డులోనూ అవినీతి.. ఆరోపించిన విశాల్
-
Tragedy: అయ్యో.. కూతురి పెళ్లి కోసం లాకర్లో ₹18లక్షలు దాస్తే... చివరకు..!!
-
Byreddy Rajasekhar reddy: స్కామ్‌లు చేయడం జగన్‌కు అలవాటేమో.. చంద్రబాబుకు కాదు: బైరెడ్డి
-
Kadapa: సచివాలయంలో సర్వేయర్‌పై వైకాపా కార్యకర్త దాడి
-
Jagan-adani: సీఎం జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ
-
రోజుకు నాలుగు గంటలు ఫోన్లోనే.. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వాడకం