California wildfire: శాంతించని దావానలం

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు లక్షలాది ఎకరాల్లో అటవీ సంపదను

Published : 07 Aug 2021 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు లక్షలాది ఎకరాల్లో అటవీ సంపదను దహించివేస్తోంది. భీకరమైన వేడిగాలుల ధాటికి మంటలు వేగంగా విస్తరిస్తూ అడ్డొచ్చిన వాటిని తనలో ఆహుతి చేసుకుంటోంది. అమెరికాలోని 13 రాష్ట్రాలకు ఈ కార్చిచ్చు విస్తరించగా.. మంటలను అదుపు చేసేందుకు 20వేల మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.

కాలిఫోర్నియాలో అడవుల్లో రగిలిన కార్చిచ్చు అంతకంతకూ దావానలంలా విస్తరిస్తోంది. ఉత్తర కాలిఫోర్నియాలోని మౌంటెన్‌ పట్టణాన్ని కార్చిచ్చు చుట్టుముట్టడంతో వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇప్పటికే మంటల్లో చిక్కుకుని పలు ఇళ్లు దగ్ధం కాగా.. మంటలు వ్యాపించకుండా ఉండేందుకు అగ్రిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.  గంటకు 64 కి.మీ వేగంతో గాలులు వీస్తుండటంతో గ్రీన్‌విల్లేలోని సియెర్రా నివాడా పట్టణం తీవ్రంగా దెబ్బతింటోంది. మంటలు వేగంగా విస్తరించడం వల్ల ఆ ప్రాంతంలోని అడవులు ఆహుతి అవుతున్నాయి. 

మంటలు ఆల్మనూరు సరస్సు వరకూ విస్తరించడతో సరస్సుకు తూర్పు ప్రాంతంలో ఉంటున్న 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దావాగ్ని ధాటికి ఆకాశంలో 30వేల అడుగుల ఎత్తు వరకూ నల్లటి పొగ ఆవరించినట్టు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. జులై 14న ప్రారంభమైన ఈ కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తూ ఇప్పటి వరకూ 67 ఇళ్లను దగ్ధం చేసింది. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో, 7,560 చ.కి.మీ మేర ఈ కార్చిచ్చు వ్యాపించిందని యూఎస్‌ నేషషనల్‌ ఇంటర్‌ఏజెన్సీ ఫైర్‌ సెంటర్‌ వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు