Naveen Jindal: రూ.50కోట్లు ఇవ్వు.. లేదంటే: నవీన్ జిందాల్‌కు బెదిరింపు లేఖ
ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ (Naveen Jindal)ను బెదిరిస్తూ ఓ ఆగంతకుడు లేఖ పంపాడు. రూ.50కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
రాయ్‌గఢ్: ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ (Naveen Jindal)ను బెదిరిస్తూ ఓ లేఖ (Threat Letter) రావడం కలకలం సృష్టించింది. రూ. 50కోట్లు ఇవ్వాలని ఆగంతకుడు అందులో డిమాండ్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు లేఖపై దర్యాప్తు చేపట్టగా.. ఓ ఖైదీ దాన్ని పంపించినట్లు తేలింది.
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని పాత్రపాలిలో గల జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (JSPL) ఫ్యాక్టరీకి గతవారం పోస్టు ద్వారా ఓ లేఖ వచ్చింది. నవీన్ జిందాల్ 48 గంటల్లోగా రూ.50కోట్లు ఇవ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడు ఆ బెదిరింపు లేఖను పంపాడు. దీంతో జిందాల్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. బిలాస్పూర్ సెంట్రల్ జైలులోని ఓ ఖైదీ దీన్ని పంపినట్లు తేలింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అయితే దీని వెనుక కారణాలు తెలియరాలేదు. నిందితుడు ఎవరనే వివరాలను కూడా పోలీసులు బయటపెట్టలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవలి కాలంలో ప్రముఖులకు వరుస బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)ని బెదిరిస్తూ ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. రూ.100కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో గల గడ్కరీ కార్యాలయానికి ఒకే రోజు రెండు ఫోన్‌కాల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అనంతరం అతడు కూడా ఖైదీ అని దర్యాప్తులో తేలింది. ఓ హత్య కేసులో కర్ణాటకలోని బెళగావి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆ ఫోన్ చేసినట్లు గుర్తించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
OTT Movies: బొమ్మ మీది.. స్ట్రీమింగ్ వేదిక మాది.. ఇప్పుడిదే ట్రెండ్!
-
World News
EarthQuake: భూకంపం ధాటికి.. రెండు ముక్కలైన ఎయిర్‌పోర్టు రన్‌వే
-
Politics News
Andhra News: బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు
-
Sports News
Ashwin - Australia: అశ్విన్‌ను చూస్తే ఆస్ట్రేలియాకు కంగారు ఎందుకు?.. సమాధానం ఇదిగో!
-
India News
Overseas Education: విదేశీ ఉన్నత విద్యపై భారీ క్రేజ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు