జమ్మూలో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాల చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రవాద కదలికల సమాచారంతో శుక్రవారం భద్రతా దళాలు మండూరా ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ను నిర్వహించారు.

Updated : 14 May 2022 15:35 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాల చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రవాద కదలికల సమాచారంతో శుక్రవారం భద్రతా దళాలు మండూరా ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ముగ్గురు ముష్కరులు భద్రతాదళాలపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతాదళాలు ప్రతిఘటించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో పోలీసులకు ఎటువంటి గాయాలవ్వలేదని పోలీసులు తెలిపారు. మరణించిన ఉగ్రవాదులను గుర్తించే చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి..

సింఘులో మళ్లీ ఉద్రిక్తతలు

ద్వైపాక్షిక బంధానికి అష్టోత్తరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని