Missile misfire: పొరపాటున పేలిన మూడు క్షిపణులు..!

రాజస్థాన్‌(Rajasthan)లో జరిగిన సాధారణ సైనిక కసరత్తుల్లో భాగంగా మూడు క్షిపణుల పేలాయి. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

Published : 25 Mar 2023 12:28 IST

జైసల్మేర్: సైన్యం నిర్వహించిన సాధారణ కసరత్తుల్లో పొరపాటున మూడు క్షిపణులు పేలాయి. రాజస్థాన్‌ (Rajasthan) లోని జైసల్మేర్‌లో ఈ ఘటన జరిగింది. పోఖ్రాన్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్(Pokhran field firing range) వద్ద జరిగిన ఈ ఘటనలో సాంకేతిక లోపమే కారణమని తెలుస్తోంది. ఈ క్షిపణులు(three surface-to-air missiles) సమీప గ్రామాల్లోని పొలాల్లోకి దూసుకెళ్లాయి. దాంతో భారీ పేలుడు సంభవించింది. అయితే, ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. 10-25 కిలోమీటర్ల పరిధి వరకు దూసుకెళ్లే ఈ క్షిపణులను పరీక్షిస్తోన్న తరుణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

దీనిపై రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్‌ అమితాబ్ శర్మ స్పందించారు. ‘సాధారణ విన్యాసాల్లో భాగంగా క్షిపణులు మిస్‌ఫైర్ అయ్యాయి. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరగుతోంది’ అని తెలిపారు. ఇక పొలాల్లోకి దూసుకెళ్లిన రెండు క్షిపణుల శకలాలను అధికారులు గుర్తించారు. మూడో దానికోసం పోలీసులు, ఆర్మీ సిబ్బంది గాలిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు