ఘోరం.. వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..!
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఓ తల్లిదండ్రుల మూఢనమ్మకం మూడు నెలల పసికందు ప్రాణం తీసింది. వ్యాధి తగ్గాలంటూ ఆ పాప శరీరంపై ఇనుపరాడ్డుతో వాతలు పెట్టడంతో ఆ చిన్నారి మృతిచెందింది.
భోపాల్: సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లోనూ ఇంకా కొందరు మూఢనమ్మకం అనే మనోవ్యాధి నుంచి బయటపడలేకపోతున్నారు. ఇంకా నాటు వైద్యం చేయించుకుంటూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ మూడు నెలల పసికందు.. ఇలాంటి మూఢనమ్మకానికి బలైంది. వ్యాధి తగ్గాలని ఆ లేత శరీరంపై 51సార్లు ఇనుప రాడ్డుతో కాల్చి వాతపెట్టారు. దీంతో అభం శుభం తెలియని ఆ చిన్నారి పదిహేను రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న షాదోల్ జిల్లాలో చోటుచేసుకుంది.
షాదోల్‌లోని సింగ్‌పుర్ కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి రుచితా కోల్ నిమోనియా (pneumonia) బారినపడింది. దీంతో పాపకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అయితే ఆమె తల్లిదండ్రులు మూఢనమ్మకంతో ఆసుపత్రికి తీసుకెళ్లకుండా స్థానికంగా ఉండే మంత్రగాళ్లకు పాపను చూపించారు. అక్కడ వ్యాధి తగ్గాలంటూ చిన్నారి పొట్టపై కాలిన ఇనుపరాడ్డు (Iron Rod)తో 51 సార్లు వాతలు పెట్టారు. ఆ తర్వాత పాప పరిస్థితి మరింత దిగజారింది. ఓవైపు కాలిన గాయాలు.. మరోవైపు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో అప్పుడు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే 15 రోజులు గడిచిపోయింది.
సరైన సమయంలో నిమోనియా (pneumonia)కు చికిత్స అందకపోవడంతో ఇన్ఫెక్షన్ (Infection) వ్యాపించి ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పాపకు హడావుడిగా అంత్యక్రియలు పూర్తిచేశారు. శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆసుపత్రికి వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే చర్యలు చేపట్టారు. ఖననం చేసిన పాప మృతదేహాన్ని వెలికి తీసి శనివారం పోస్టుమార్టం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఘటనపై షాదోల్ జిల్లా కలెక్టర్ వందన వేధ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘వాతలు పెట్టొద్దని స్థానిక అంగన్వాడీ కార్యకర్త చెప్పినా ఆ పాప తల్లి పట్టించుకోలేదు. గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిమోనియాకు ఇలాంటి ‘చికిత్స’లు సర్వసాధారణమయ్యాయి. దీనిపై చర్యలు తీసుకుంటున్నాం’’ అని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని భాజపా నేతలు.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ను కోరారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Agniveers: ఐఎన్ఎస్ చిలికాలో తొలి బ్యాచ్ అగ్నివీర్ల పాసింగ్ అవుట్ పరేడ్.. త్వరలోనే విధుల్లోకి
-
Sports News
Lionel Messi: మెస్సికి అరుదైన గౌరవం.. ఫుట్‌బాల్ దిగ్గజాల సరసన విగ్రహం
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ
-
Politics News
DK Shivkumar: ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకేఎస్.. వీడియో వైరల్
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Latestnews News
Quadruplets: ఒకే కాన్పులో నలుగురు పిల్లల జననం