సంస్కృతం నేర్చుకోనున్న ఇస్లామిక్‌ దేశాల విద్యార్థులు

భారతదేశంలో సంస్కృతి, సంప్రదాయాలు.. భిన్నత్వంలోని ఏకత్వాన్ని ప్రపంచదేశాలు హర్షిస్తుంటాయి. భారత్‌ గొప్పదనాన్ని కళ్లారా చూడాలని, తెలుసుకోవాలని ఎన్నో దేశాల నుంచి పర్యటకులు వస్తుంటారు. కొంత మంది విదేశీ విద్యార్థులు మన యూనివర్సిటీల్లో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకుంటారు. అయితే, ఇటీవల గుజరాత్‌లోని

Updated : 01 Jul 2021 05:57 IST

అహ్మదాబాద్‌: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు.. భిన్నత్వంలోని ఏకత్వాన్ని ప్రపంచదేశాలు హర్షిస్తుంటాయి. భారత్‌ గొప్పదనాన్ని కళ్లారా చూడాలని, తెలుసుకోవాలని ఎన్నో దేశాల నుంచి పర్యటకులు వస్తుంటారు. కొంత మంది విదేశీ విద్యార్థులు మన యూనివర్సిటీల్లో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకుంటారు. అయితే, ఇటీవల గుజరాత్‌లోని సంస్కృత యూనివర్సిటీకి వచ్చిన మూడు దరఖాస్తులు వర్సిటీ అధికారులతో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 

గుజరాత్‌లోని వీరవల్‌లో ఉన్న శ్రీ సోమనాథ్‌ సంస్కృత యూనివర్సిటీని 2005లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అప్పటి నుంచి రాష్ట్ర విద్యార్థులకే కాకుండా దేశవ్యాప్తంగా విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పిస్తోంది. ఇటీవల విదేశీ విద్యార్థులకు సైతం అడ్మిషన్‌ ఇవ్వాలని యూనివర్సిటీ నిర్ణయించింది. దీంతో ఆశ్చరకరంగా ఈ వర్సిటీలో సంస్కృతం కోర్సు చదువుకునేందుకు ఇస్లామిక్‌ దేశాలైన బంగ్లాదేశ్‌, ఇరాన్‌, ఆఫ్గానిస్థాన్‌ నుంచి ముగ్గురు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇరాన్‌కు చెందిన ఫర్షాద్‌ సాలెజెహి బీఏ (సంస్కృతం - సాహిత్యం), బంగ్లాదేశ్‌కు చెందిన రథింద్రో సర్కార్‌ సంస్కృతంలో డాక్టరేట్‌ ప్రోగ్రాం, ఆఫ్గానిస్థాన్‌కు చెందిన మసూర్‌ సంగీమ్‌ అనే విద్యార్థి సంస్కృతం కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. 

మొత్తం తొమ్మిది మంది విదేశీయులు యూనివర్సిటీలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఆరుగురు కోరిన కోర్సులు వర్సిటీలో లేకపోవడంతో వారి దరఖాస్తులను నిరాకరించినట్లు అధికారులు వెల్లడించారు. పైన పేర్కొన్న ముగ్గురు మాత్రమే అడ్మిషన్‌ పొందడానికి అర్హత సాధించారని తెలిపారు. ఈ విషయంపై యూనివర్సిటీ పీజీ ప్రోగ్రామ్స్‌ హెడ్‌ లలిత్‌ పటేల్‌ మాట్లాడుతూ.. విదేశీ విద్యార్థులు సంస్కృతం కోర్సు చదువుకేనేందుకు దరఖాస్తు చేసుకోవడం ఇదే తొలిసారని, ఇది తమకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని