Zika Virus: కేరళలో మరో 3 జికా కేసులు

కేరళలో జికా వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆ రాష్ట్రంలో మరో మూడు జికా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 46 వ్యక్తి, 29 ఏళ్ల హెల్త్‌ వర్కర్‌తోపాటు 22 నెలల వయసున్న చిన్నారి ఉంది. తాజా కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో నమోదైన

Published : 12 Jul 2021 01:11 IST

తిరువనంతపురం: కేరళలో జికా వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆ రాష్ట్రంలో మరో మూడు జికా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 46 ఏళ్ల వ్యక్తి, 29 ఏళ్ల హెల్త్‌ వర్కర్‌తోపాటు 22 నెలల వయసున్న చిన్నారి ఉంది. తాజా కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో నమోదైన జికా కేసుల సంఖ్య 18కి చేరింది.

జికా వైరస్‌ అంశంపై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ మాట్లాడుతూ.. జికా వైరస్‌ టెస్టింగ్‌ కోసం తిరువనంతపురం, త్రిస్సూర్‌, కొజికోడ్‌ మెడికల్‌ కాలేజీల్లో, అలప్పీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరిన్ని టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇటీవల రెండు బ్యాచ్‌లుగా 27 నమూనాలను టెస్టింగ్‌కు పంపగా.. అందులో 26 నమూనాలు నెగటివ్‌గా తేలయన్నారు. అయితే, తాజాగా మూడో బ్యాచ్‌ కింద ఎనిమిది నమూనాలు పంపగా.. అందులోని మూడు నమూనాల్లో జికా వైరస్‌ను గుర్తించినట్లు తెలిపారు.

జికా వైరస్‌ను గుర్తించడానికి పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ 2,100 టెస్ట్‌ కిట్లు పంపిందని వాటిలో వెయ్యి తిరువనంతపురానికి, 300 చొప్పున త్రిస్సూర్‌, కొజికోడ్‌కు , 500 టెస్ట్‌ కిట్లు అలప్పీలోని ఎన్‌ఐవీకి పంపిణీ చేసినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని