Tiger: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులి.. వేటకు హైదరాబాద్‌ షూటర్‌

బిహార్‌ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్‌ జిల్లా బగహా ప్రాంత వాల్మీకి టైగర్‌ రిజర్వ్‌ (వీటీఆర్‌) అడవుల పరిసర గ్రామాలను పులి భయం వీడటం లేదు. నరమాంస భక్షకిగా మారిన ఓ పులిని పట్టుకునేందుకు అటవీశాఖ రెస్క్యూ బృందం నానా తంటాలు పడుతోంది.

Updated : 01 Oct 2022 06:49 IST

అయిదుగురిని చంపిన వ్యాఘ్రం

బగహా: బిహార్‌ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్‌ జిల్లా బగహా ప్రాంత వాల్మీకి టైగర్‌ రిజర్వ్‌ (వీటీఆర్‌) అడవుల పరిసర గ్రామాలను పులి భయం వీడటం లేదు. నరమాంస భక్షకిగా మారిన ఓ పులిని పట్టుకునేందుకు అటవీశాఖ రెస్క్యూ బృందం నానా తంటాలు పడుతోంది. స్థానిక బైరియా కాలా గ్రామం కేంద్రంగా నిపుణుల సాయంతో అటవీశాఖ సిబ్బంది పులి ఆచూకీ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. తాజాగా ఆ పులి తన స్థావరం మార్చుకొని, హరిహర్‌పుర్‌ గ్రామ చెరకు తోటల్లోకి చేరింది. గత నెల ఈ పులి అయిదుగురు గ్రామస్థులను చంపింది. దీన్ని పట్టుకునేందుకు నాలుగు ఏనుగులను కూడా రప్పించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు భయంతో కంటి మీద కునుకు ఉండటం లేదు. 150 మంది అధికారులు, సిబ్బంది ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ షూటర్‌ నవాబ్‌ షఫత్‌ అలిఖాన్‌ కూడా రంగంలోకి దిగారు. గురువారం పులిని పట్టుకునేందుకు ఓ బోనులో మేకను పెట్టగా.. తెల్లవారుజామున వేటగాళ్ల సమక్షంలోనే పులి చాకచక్యంగా మేకను పట్టుకుపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని