Viral news: ప్రాణం తీసిన పులిని చంపాలనుకుంటే.. మరోసారి దాడి చేసింది

తమ గ్రామస్థుడిని హతమార్చిన పులిని చంపేందుకు వారంతా ఒక చోట చేశారు. కానీ, మాటు వేసిన ఆ పులి గుంపులో మరో ఇద్దరిపై దాడి చేసి పారిపోయింది.

Published : 12 Dec 2022 01:16 IST

భోపాల్‌: పెద్దపులి (Tiger) దాడి చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆగ్రహం చెందిన గ్రామస్థులు పులిని అంతం చేయాలనుకున్నారు. గ్రామస్థులంతా కర్రలు, పదునైన ఆయుధాలతో ఒక చోట సిద్ధంగా ఉన్నారు. ఈలోగా మాటు వేసిన పెద్దపులి మరో ఇద్దరిని గాయపరిచి పారిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌(Madhyapradesh)లోని సియోని జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌ సమీపంలోని గోండే గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తికిపై ఆదివారం పెద్దపులి దాడి చేసింది. అరుపులు విన్న గ్రామస్థులు అక్కడికి వెళ్లినప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు ఆ పులిని చంపాలని నిర్ణయించుకున్నారు. కర్రలు, పదునైన ఆయుధాలతో సిద్ధమయ్యారు. కానీ, కొద్దిసేపటి తర్వాత పెద్దపులి మరో ఇద్దరిపై దాడి చేసి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌ అధికారి అఖిలేశ్‌ మిశ్రా గోండే గ్రామానికి వెళ్లారు. దీంతో  ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు క్రూరమృగాలు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవడం లేదంటూ అతడిపై దాడికి దిగారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు గ్రామానికి వెళ్లి.. తీవ్ర గాయాలపాలైన అఖిలేశ్‌ మిశ్రాను వైద్యం కోసం జబల్‌పూర్‌లోని డివిజన్‌ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. గ్రామస్థుల దాడిలో అటవీశాఖకు చెందిన ఆరు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని ఏఎస్పీ  తెలిపారు. జిల్లా ఎస్పీ రామ్‌జీ శ్రీవాస్తవ గ్రామానికి చేరుకొని గ్రామస్థులతో చర్చించారు. పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో గ్రామస్థులు శాంతించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని