జైల్లో ఆఫ్తాబ్‌ ప్రవర్తన ఎలా ఉంది..? అతడికి అధికారులు ఏం ‘పుస్తకం’ ఇచ్చారు..?

తిహాడ్‌ జైల్లో ఉన్న ఆఫ్తాబ్‌ ఆమిన్‌ పూనావాలా ప్రవర్తనను  జైలు అధికారులు అణుక్షణం పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో అతడికి అమెరికన్‌ నవలా రచయిత రాసిన ‘ది గ్రేట్‌ రైల్వే బజార్‌’ పుస్తకాన్ని అందించినట్లు సమాచారం.

Published : 05 Dec 2022 01:34 IST

దిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ ఆమిన్‌ పూనావాలా విచారణ ఖైదీగా ప్రస్తుతం దిల్లీలోని తీహాడ్‌ జైల్లో ఉన్నాడు. ఇటీవలే అతడికి పాలిగ్రాఫ్‌, నార్కో టెస్టులు కూడా పూర్తయ్యాయి. అయితే, ఓ పుస్తకం కావాలని జైలు అధికారులకు విజ్ఞప్తి చేయగా.. ‘ది గ్రేట్‌ రైల్వే బజార్‌’ అనే ఇంగ్లీష్‌ పుస్తకాన్ని అందించినట్లు తెలిసింది.

ఆసియాలో రైలు ప్రయాణ అనుభవాలను తెలియజేస్తూ అమెరికన్‌ నవలా రచయిత పాల్‌ థెరాక్స్‌ ‘ది గ్రేట్‌ రైల్వే బజార్‌’ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో ఎటువంటి నేర సంబంధ కోణం లేకపోవడం, ఆఫ్తాబ్‌తోపాటు సహచర ఖైదీలకు ఎటువంటి హాని కలగదనే ఉద్దేశంతో జైలు అధికారులు అతడికి ఈ పుస్తకాన్ని అందించినట్లు సమాచారం.

విచారణ ఖైదీగా ఉన్న ఆఫ్తాబ్‌ కేటాయించిన గదిలో మరో ఇద్దరు ఖైదీలు కూడా ఉన్నారు. వారిద్దరూ చోరీ కేసులో నిందితులే. ఈ నేపథ్యంలో ఆఫ్తాబ్‌ ప్రవర్తనను జైలు అధికారులు అణుక్షణం పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో అతడు ఎక్కువ సమయం చెస్‌ ఆడటానికి పరిమితమవడం, లేదా ఒంటరిగా కూర్చుంటున్నట్లు గమనించారు. అయితే, చెస్‌ను తోటి ఖైదీలతో పాటు ఇరువైపుల (నలుపు, తెలుపు పావులను) ఒక్కడే ఆడుకుంటున్నట్లు తెలిపారు. ఈ సామర్థ్యాన్ని బట్టి చూస్తే.. కుట్రలో ప్రతి కదలిక కూడా పక్కా ప్రణాళికతోనే చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని