Tiktok:ఈఏడు గూగుల్‌ను అధిగమించిన టిక్‌టాక్‌

ప్రముఖ షార్ట్‌ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ టిక్‌టాక్‌, టెక్‌ దిగ్గజమైన గూగుల్‌ను అధిగమించి ఈఏడు అత్యంత..

Published : 25 Dec 2021 18:17 IST

శాన్‌ఫ్రాన్సిస్‌కో: ప్రముఖ షార్ట్‌ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ టిక్‌టాక్‌, టెక్‌ దిగ్గజమైన గూగుల్‌ను అధిగమించి ఈఏడు అత్యంత ప్రజాదరణ కలిగిన వెబ్‌సైట్‌గా నిలిచిందని ఐటీ భద్రతా సంస్థ క్లౌడ్‌ఫ్లేర్‌ వెలువరించిన నివేదికలో తెలిపింది. వైరల్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ యూఎస్‌ ఆధారిత సెర్చ్ ఇంజిన్‌ గూగుల్‌ కంటే అధికంగా హిట్‌లను అందుకుందని పేర్కొన్నారు. ఈఏడాది ఫిబ్రవరి, మార్చి, జూన్‌ లలో గూగుల్‌ అగ్రస్థానంలో ఉండగా ఆగస్ట్‌ నుంచి టిక్‌టాక్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు ర్యాంకింగ్‌లు సూచిస్తున్నట్లు వెల్లడించారు. 2020లో గూగుల్‌ అగ్రస్థానంలో నిలవగా టిక్‌టాక్‌ సహా అమెజాన్‌, ఆపిల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఇతర సైట్‌లు టాప్‌ టెన్‌ జాబితాలో చోటుదక్కించుకున్నాయని పేర్కొన్నారు. కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, వినోదం కోసం టిక్‌టాక్‌ను ఎక్కువగా ఆస్వాదించడం టిక్‌టాక్‌కు జనాదరణ పెరగడానికి కారణమైందని నివేదికలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని