Published : 02 Nov 2021 02:00 IST

TikTok- ByteDance:  రాత్రి 7 గంటలు దాటిందా? ఇక పని చేయొద్దు

ఉద్యోగులకు టిక్‌టాక్‌ ‘బైట్‌ డ్యాన్స్‌’ గుడ్‌ న్యూస్‌
పనిఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం 
ఆనందం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

బీజింగ్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలంటే సమయంతో సంబంధం లేకుండా పనిచేయాల్సి వస్తుంది. కంపెనీ ఆదేశాల ప్రకారం.. పగలు, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి..  ఇలా ఏది నిర్దేశిస్తే ఆ షిప్ట్‌కి రావాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతీ చోటా జరిగిది ఇదే! అయితే టిక్‌టాక్‌ సంస్థ మాతృ సంస్థ  బైట్‌డ్యాన్స్‌ లిమిటెడ్‌ (Byte dance) అనే చైనీస్‌ మల్టీనేషనల్‌ ఇంటర్నెట్‌ టెక్నాలజీ కంపెనీ మాత్రం వీటికి విభిన్నంగా నిర్ణయం తీసుకుంది. తమ దగ్గర పనిచేసే ఉద్యోగులకు ఊరటనిచ్చే గుడ్‌న్యూస్‌ చెప్పింది.  అదేంటంటే.. సోమవారం నుంచి శుక్రవారం వరకే పనిరోజులు ఉంటాయని కాగా రాత్రి ఏడు గంటలు దాటిన తరువాత పని చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఒక వేళ పనిచేయాల్సిన సందర్భం వస్తే కంపెనీ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇదంతా ఉద్యోగుల సంక్షేమార్థం తీసుకొచ్చిన కొత్త పాలసీ అని బైట్‌ డ్యాన్స్‌ కంపెనీ ప్రకటించింది.

‘996’ కల్చర్‌కి బై బై
సాధారణంగా చైనాలో ‘996’ వర్క్‌ కల్చర్‌ ( అంటే వారంలోని 6 రోజుల పాటు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటలకు వరకూ) ఉంటుంది. అంటే పనివేళలు 12గంటలన్న మాట. పనిఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, మానసిక సమస్యలు కారణంగా అక్కడ ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. దీంతో సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా కంపెనీల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయంపై ఈ ఏడాది ఆగస్టులో చైనాలోని సుప్రీం పీపుల్స్‌ కోర్టు ‘996’ చట్టవిరుద్ధమని తీర్పు ప్రకటించింది. ప్రస్తుతం టిక్‌టాక్‌ సంస్థ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు అక్కడి ఉద్యోగులు.

అలా చేస్తే 3రెట్లు జీతం ఎక్కువ

ఓ ఆన్‌లైన్‌ రిపోర్ట్‌ ప్రకారం.. చైనాలోని అధికారులు ఉద్యోగులతో ఓవర్‌టైమ్ చేయించడంతో పాటు ఇతర ఉల్లంఘనలకు దూరంగా ఉండాలని  కంపెనీలకు డ్రాగన్‌ ప్రభుత్వం హెచ్చరికలు చేసింది.  ఇదే విషయంపై అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందిస్తూ.. దేశం ఉమ్మడి శ్రేయస్సు కోసం పని చేయాలని కంపెనీలు, అధికారులకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మీడియా బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. చైనాలో పని విధానానికి సంబంధించి కొత్త పాలసీని తీసుకొచ్చారు. దాని ప్రకారం ఉద్యోగులు.. ఓవర్‌టైమ్‌ డ్యూటీ చేయాలన్నా కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటంటే.. వారంలో మూడు గంటల కంటే ఎక్కువ (లేదా) వారాంతంలో 8 గంటల పాటు ఓవర్‌టైమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దానికోసం వారు తీసుకునే సాధారణ జీతం కంటే 3 రెట్ల అదనపు జీతం వారికి అందుతుంది.


 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని