TMC: గుజరాత్‌ పోలీసుల అదుపులో టీఎంసీ కీలక నేత

గుజరాత్‌ పోలీసులు(Gujarat police) తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC) కీలక నేతలను అదుపులోకి తీసుకొన్నారు. రాజస్థాన్‌(Rajasthan) లో ఆయన విమానం దిగగానే అదుపులోకి తీసుకొని గుజరాత్‌ తరలించారు. 

Updated : 06 Dec 2022 10:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ పార్టీ అధికారిక ప్రతినిధి సాకేత్‌ గోఖలే(Saket Gokhale)ను గుజరాత్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారని తృణముల్‌ కాంగ్రెస్‌ (TMC)ఆరోపించింది. ఈ చర్యను రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ డెరెక్‌ ఓబ్రియన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. సాకేత్‌ జైపూర్‌ వెళుతుండగా ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారని వెల్లడించారు. గతంలో మోర్బీ వంతెన దుర్ఘటన(the Morbi bridge collapse)పై అతడు చేసిన ట్వీట్ల కారణంగానే ఈ కక్షసాధింపు చర్యలను చేపట్టారని ఆరోపించారు. 

‘‘సాకేత్‌ నిన్ని రాత్రి దిల్లీ నుంచి జైపూర్‌ వెళ్లేందుకు విమానం ఎక్కారు. ఆయన విమానం రాజస్థాన్‌లో ల్యాండ్‌ అవ్వగానే అప్పటికే అక్కడ వేచ్చి ఉన్న గుజరాత్‌ పోలీసులు (Gujarat Police) అయన్ను అదుపులోకి తీసుకొన్నారు. తెల్లవారు జామున రెండు గంటల సమయంలో సాకేత్‌ తల్లికి ఫోన్‌ చేసి తనను అహ్మదాబాద్‌ తీసుకెళుతున్నట్లు వెల్లడించాడు. మధ్యాహ్నం నాటికి అక్కడికి చేరుకొంటానని పేర్కొన్నాడు. అనంతరం అతడి ఫోన్‌.. ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మోర్బీ వంతెన కూలిన ఘటనపై అతడు చేసిన ట్వీట్లను దృష్టిలోపెట్టుకొని అక్రమ కేసును బనాయించారు. ఇటువంటివి పార్టీ, ప్రతిపక్షాల నోరు మూయించలేవు. రాజకీయ కక్షసాధింపును భాజపా మరింత ముందుకు తీసుకువెళ్లింది’’ అని డెరెక్‌ ఆరోపించారు. 

మరోవైపు సాకేత్‌ అరెస్టు పై జైపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో దిగ్‌పాల్‌ సింగ్‌ స్పందించారు. అతడి అరెస్టుపై తమకు ఎటువంటి సమాచారం లేదని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని