Tokyo: అటు క్రీడా సంబరం.. ఇటు కరోనా కలకలం!

ఒలింపిక్స్‌ మహా క్రీడా సంబరం శుక్రవారమే లాంఛనంగా ప్రారంభం కానున్న వేళ టోక్యో నగరంలో కొవిడ్‌ కేసులు..........

Published : 21 Jul 2021 21:00 IST

ప్రపంచ క్రీడల ఆతిథ్య నగరంలో పెరుగుతున్న కేసులు

టోక్యో: ఒలింపిక్స్‌ మహా క్రీడా సంబరం శుక్రవారమే లాంఛనంగా ప్రారంభం కానున్న వేళ టోక్యో నగరంలో కొవిడ్‌ కేసులు పెరగడం కలవర పెడుతోంది. తాజాగా జపాన్‌ రాజధాని నగరంలో కొత్త కేసులు ఆరు నెలల గరిష్ఠానికి చేరడం కలకలం రేపుతోంది. ఈ రెండు రోజుల్లోనే అక్కడ 1,832 కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభణ దృష్ట్యా ఆగస్టు 22 వరకు అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అత్యయిక స్థితి సమయం ముగిసేలోపే అంతర్జాతీయ ఒలింపిక్‌ క్రీడలు ముగిసిపోనున్నాయి. కరోనా మహమ్మారి కలకలంతో టోక్యో ప్రాంతానికి అభిమానుల రాకను సైతం నిషేధించారు. ఈ మెగా క్రీడలకు ప్రేక్షకులను అనుమతించబోమని, టీవీల్లోనే చూడాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంచేసింది.

తాజా పరిస్థితుల నేపథ్యంలో జపాన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టోషియా నకగవా మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌తో సంబంధం లేకుండానే ఈ పెరుగుదలను అంచనా వేసినట్టు తెలిపారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో నెలకొన్న అనిశ్చితి వల్లే యువత, వ్యాక్సిన్‌ వేసుకోని వారిలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు, జపాన్‌లో ఇప్పటివరకు దాదాపు 23 శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్‌ వేసుకున్నారు. 

రాబోయే కొన్ని వారాల్లో టోక్యోలో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయని ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. టోక్యో మెట్రోపాలిటన్‌ ప్రభుత్వ నిపుణుల బృందం సభ్యుడు డాక్టర్‌ నోరియో ఒహమగరి మాట్లాడుతూ.. ఇదే వేగంతో కేసులు పెరిగితే మరో రెండు వారాల్లో టోక్యోలో రోజుకు సగటున 2,600 చొప్పున కేసులు నమోదవుతాయన్నారు. జపాన్‌లో ఇప్పటివరకు 84,800 కేసులు, 15వేల మరణాలు నమోదయ్యాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని