Ratan Tata: ఆర్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి హిందువులకేనా.. గడ్కరీకి రతన్‌టాటా ప్రశ్న

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ఆసుపత్రి గురించి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా మధ్య ఓ సారి ఆసక్తికర సంభాషణ జరిగింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి కేవలం హిందువులకేనా

Published : 15 Apr 2022 11:04 IST

పుణె: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ఆసుపత్రి గురించి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా మధ్య ఓ సారి ఆసక్తికర సంభాషణ జరిగింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి కేవలం హిందువులకేనా అని టాటా ప్రశ్నించారట. ఈ విషయాన్ని గడ్కరీనే స్వయంగా వెల్లడించారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ మతపరమైన వివక్ష చూపదని గతంలో తాను టాటాకు వివరించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. మహారాష్ట్రలోని సింహగఢ్‌లో ఓ ఛారిటబుల్‌ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. 

మహారాష్ట్రలో భాజపా-శివసేన ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎదురైన అనుభవాన్ని గడ్కరీ పంచుకున్నారు. ‘‘నేను మహారాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు... ఆర్‌ఎస్‌ఎస్‌ దివంగత అధ్యక్షుడు కె.బి.హగ్డేవార్‌ పేరున నెలకొల్పిన ఆసుపత్రిని ప్రారంభించాలని అనుకున్నాం. అయితే, దాన్ని రతన్‌ టాటాతో ప్రారంభించాలని, అందుకు సాయం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడొకరు నన్ను కోరారు. కార్యక్రమానికి రావాలని ఆయన్ను ఎలాగోలా ఒప్పించాను. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన... కేవలం హిందువులకే ఇక్కడ వైద్యం అందిస్తారా? అని అడిగారు. మీరు ఎందుకు అలా ఆలోచించారని నేను ప్రశ్నించాను. ‘ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఆసుపత్రి కదా.. అందుకే అడిగాను’ అని ఆయన బదులిచ్చారు. ఈ ఆసుపత్రి అందరికీ సేవలు అందిస్తుందని, ఆర్‌ఎస్‌ఎస్‌ మతపరమైన వివక్ష చూపదని నేను ఆయనకు స్పష్టం చేశాను’’ అని గడ్కరీ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని