ఉత్తరాఖండ్‌ విషాదం: 41మృతదేహాల వెలికితీత!

ఉత్తరాఖండ్‌లో సంభవించిన వరద ప్రమాదంలో గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది.

Updated : 14 Feb 2021 14:29 IST

తపోవన్‌: ఉత్తరాఖండ్‌లో సంభవించిన వరద ప్రమాదంలో గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. తపోవన్‌ ప్రాజెక్టు సొరంగం వద్ద చిక్కుకుపోయిన 30మంది కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఓవైపు సొరంగం నుంచి బురదను బయటకు తోడుతుండగా, మరోవైపు సొరంగానికి రంధ్రాలు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గాలింపు ప్రయత్నాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. అయితే, తపోవన్‌ సొరంగం నుంచి ఆదివారం నాడు మూడు మృతదేహాలు వెలికితీయడంతో, ఇప్పటివరకు ఆ ఘటనలో మొత్తం 41మృతదేహాలను వెలికితీసిట్లు అధికారులు వెల్లడించారు.

వరద సమయంలో తపోవన్‌ సొరంగంలో పనిచేస్తున్న ముప్పై మందికిపైగా కార్మికులు అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరిలో తొలిసారి ముగ్గురి మృతుదేహాలను వెలికితీసినట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌ ఆర్‌కే తివారి వెల్లడించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రాణాలతో బయటపడేవారిని వీలైనంత తొందరగా ఆసుపత్రికి తరలించేందుకు హెలికాప్టర్‌ కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఆదివారం నాడు వెలికితీసిన మూడు మృతదేహాల్లో రెండింటిని గుర్తించినట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఉన్నతాధికారి తివారి స్పష్టంచేశారు.

ఈ నెల 7వ తేదీన ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుని దాదాపు 200మందికిపైగా గల్లంతైన విషయం తెలిసిందే. చమోలీ జిల్లాలో జరిగిన ఆ వరద ప్రమాదంలో ఇప్పటివరకు 41మృతదేహాలను గుర్తించగా, మిగిలిన వారికోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఇందుకోసం భారత ఆర్మీతో పాటు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ భారీ ఆపరేషన్‌ చేపట్టాయి.

ఇవీ చదవండి..
ఆ తల్లి ఫోన్‌ కాల్‌.. 25 మందిని కాపాడింది
ఉత్తరాఖండ్‌: కలవరపెడుతోన్న ‘డేంజర్‌ లేక్‌’!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని