Nitin Gadkari: ఆ టోల్‌ ప్లాజాలను 3 నెలల్లో మూసేస్తాం: నితిన్‌ గడ్కరీ

జాతీయ రహదారులపై ఒక టూల్‌ బూత్‌ నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో మరో టోల్‌ ప్లాజా ఉండకూడదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు

Published : 24 Mar 2022 01:24 IST

దిల్లీ: జాతీయ రహదారులపై ఒక టూల్‌ బూత్‌ నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో మరో టోల్‌ ప్లాజా ఉండకూడదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. అలా ఉన్నవాటిని మూడు నెలల్లో మూసివేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన  లోక్‌సభలో ప్రకటించారు. 

రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు నిధుల కేటాయింపులపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల పరిధిలో రెండు టోల్‌ ప్లాజాలు ఉండకూడదు. కానీ కొన్ని ప్రాంతాల్లో అలా ఉన్నాయి. ఇది తప్పు. చట్ట విరుద్ధం కూడా. ఒక టోల్‌ బూత్‌కు 60 కిలోమీటర్లలోపే రెండో టోల్‌ ప్లాజా ఉంటే వాటిని మూసివేస్తాం. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం.  ప్రభుత్వానికి డబ్బు వస్తుంది కదా అని ఆలోచిస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు. అందుకే వాటిని తొలగించాలని నిర్ణయించాం’’ అని గడ్కరీ వెల్లడించారు. దీంతో పాటు టోల్‌ ప్లాజాలకు దగ్గరగా నివసించే ప్రజలు తమ ఆధార్‌ కార్డులు చూపించి పాస్‌లు తీసుకోవచ్చని గడ్కరీ ఈ సందర్భంగా తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని