టూల్‌కిట్‌ కేసు: మీడియాకు హైకోర్టు సూచనలు!

అన్నదాతల ఆందోళనకు సంబంధించిన ‘టూల్‌ కిట్‌’ వ్యవహారంలో అరెస్టైన సామాజిక ఉద్యమకారిణి దిశ రవికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌, ఇతర దర్యాప్తునకు సంబంధించి లీకైన వివరాలను ప్రచురించొద్దని మీడియాను దిల్లీ హైకోర్టు ఆదేశించింది....

Published : 19 Feb 2021 15:28 IST

టూల్‌కిట్‌ కేసులో మీడియాకు దిల్లీ హైకోర్టు ఆదేశాలు

దిల్లీ: అన్నదాతల ఆందోళనకు సంబంధించిన ‘టూల్‌ కిట్‌’ వ్యవహారంలో అరెస్టైన పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌, ఇతర దర్యాప్తునకు సంబంధించి లీకైన వివరాలను ప్రచురించొద్దని మీడియాను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. సమాచారాన్ని అధికారిక వర్గాల నుంచి ధ్రువీకరించుకొని.. దాని వల్ల దర్యాప్తునకు ఎటువంటి అవరోధం కలగదని నిర్ధారించుకున్న తర్వాతే ప్రచురించాలని సూచించింది. నిబంధనల్ని ఉల్లంఘించడం వల్ల దర్యాప్తునకు ఆటంకాలు కలగొచ్చని అభిప్రాయపడింది. తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి ఎలాంటి దర్యాప్తు సమాచారాన్ని మీడియాకు లీక్‌ చేయకుండా చూడాలంటూ దిశ రవి ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని శుక్రవారం విచారించిన జస్టిస్‌ ప్రతిభా సింగ్‌ ధర్మాసనం పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇప్పటి వరకు ప్రచురితమైన వార్తల్ని, పోలీసులు చేసిన ట్వీట్లను తొలగించేలా ఆదేశాలివ్వాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను మాత్రం ధర్మాసనం ప్రస్తుతానికి పక్కనబెట్టింది. 

అలాగే దిల్లీ పోలీసులకూ హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. మీడియాకు సమాచారాన్ని లీక్‌ చేయలేదంటూ దాఖలు చేసిన ప్రమాణపత్రానికి కట్టుబడి ఉండాలని ఆదేశించింది. కేసు దర్యాప్తుపై చట్టానికి లోబడి.. నిబంధనల ప్రకారం మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సందర్భంగా కొన్ని మీడియా సంస్థలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించి గతంలో ప్రచురించిన కొన్ని వార్తలు సంచలనాత్మకంగా.. పక్షపాతపూరితంగా ఉన్నాయని అభిప్రాయపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని