దిశారవికి మరో రోజు కస్టడీ పొడిగింపు

ట్విటర్‌లో పర్యావరణవేత్త గ్రెటా థెన్‌బర్గ్‌ షేర్‌ చేసిన ‘టూల్‌ కిట్‌’ కేసులో అరెస్టైన సామాజిక కార్యకర్త దిశరవి పోలీసు కస్టడీని మరో రోజు పొడిగిస్తూ దిల్లీ కోర్టు సోమవారం ఉత్తర్వులిచ్చింది.

Updated : 22 Feb 2021 19:21 IST

దిల్లీ: ట్విటర్‌లో పర్యావరణవేత్త గ్రెటా థెన్‌బర్గ్‌ షేర్‌ చేసిన ‘టూల్‌ కిట్‌’ కేసులో అరెస్టైన సామాజిక కార్యకర్త దిశా రవి పోలీసు కస్టడీని మరో రోజు పొడిగిస్తూ దిల్లీ కోర్టు సోమవారం ఉత్తర్వులిచ్చింది. సోమవారంతో ఆమె కస్టడీ ముగుస్తుండటంతో పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. శనివారం  బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న నికితా జాకబ్‌, శంతను ములుక్‌లు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. దిశారవికి కస్టడీ అవసరం లేకపోయినా సహనిందితులైన నికితా, శంతనుల విచారణ కొనసాగుతుండటంతో కస్టడీ కోరినట్లు పోలీసులు కోర్టుకు వెల్లడించారు.

స్వీడన్‌కు చెందిన పర్యావరణవేత్త గ్రెటా థెన్‌బర్గ్‌ షేర్‌ చేసిన టూల్‌కిట్‌ను రూపొందించడంలో సామాజిక కార్యకర్త  రవితో పాటు నికితా జాకబ్‌, శంతను ములుక్‌లు పాలుపంచుకున్నట్లు ఆధారాలున్నాయని దిల్లీ పోలీసులు గతంలో కోర్టుకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13న బెంగళూరులోని ఆమె నివాసంలో దిశారవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నికితా జాకబ్‌, శంతనులకు పోలీసుల వినతి మేరకు దిల్లీ న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేయగా వారిరువురూ ట్రాన్సిట్‌ బెయిల్‌ పొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని