Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్’ న్యూస్!
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. గత 18 రోజులుగా కొత్త కేసుల కన్నా రికవరీ అవుతున్న వారి సంఖ్యే భారీగా ఉండటం ఉపశమనం కలిగిస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్, కఠిన ఆంక్షలు అమలు చేయడం సత్ఫలితాలను ఇస్తున్నాయి. కొత్త కేసులు తగ్గుదలతో పాటు పాజిటివిటీ రేటు దిగి వస్తోంది. మరోవైపు, బ్లాక్ ఫంగస్ చికిత్సకు కేంద్ర ప్రభుత్వం అదనంగా మరిన్ని ఇంజెక్షన్లను రాష్ట్రాలకు సమకూర్చింది. కొవిడ్ వేళ.. ఉపశమనం కలిగించే కొన్ని వార్తలు మీకోసం..
👍 భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తగ్గుముఖం పడుతోంది. వరుసగా నాలుగో రోజూ కొత్త కేసులు 2లక్షల కన్నా తక్కువే నమోదయ్యాయి. వరుసగా 18వ రోజూ కొత్త కేసుల కన్నా రికవరీ అయినవారి సంఖ్యే అధికంగా నమోదైంది. మరోవైపు, మరణాల సంఖ్య కూడా తగ్గుతుండటం కొంత ఊరటనిస్తోంది. నిన్న ఒక్కరోజే 2.38లక్షల మందికి పైగా కోలుకొని డిశ్చార్జి కాగా.. దేశవ్యాప్తంగా 3128 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. వరుసగా ఏడో రోజూ రోజువారీ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా తక్కువే (9.07%) నమోదైంది. ఇప్పటివరకు 34.48కోట్ల పరీక్షలు చేయగా.. 21.3కోట్ల డోసులకు పైగా టీకాలు పంపిణీ చేశారు.
👍 కరోనా రక్కసి నుంచి బయట పడుతున్నప్పటికీ కొందరిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనబడటంతో వారికి చికిత్స అందించేందుకు కేంద్రం మరిన్ని ఆంఫోటెరిసిన్ -బి ఇంజెక్షన్లను కేటాయించింది. ఇప్పటికే పలు దఫాలుగా ఈ ఇంజెక్షన్లను కేటాయించిన కేంద్రం.. అదనంగా మరో 30,100 వయల్స్ కేటాయించింది. వీటిలో ఏపీకి 1600 వయల్స్.. తెలంగాణకు 1200 వయల్స్ చొప్పున కేటాయించింది.
👍వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం ఏపీ నుంచి విదేశాలకు వెళ్లే వారికి టీకా వేయించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వారికి వ్యాక్సిన్ ఇచ్చినట్టుగా ప్రభుత్వం తరఫున సర్టిఫికేట్ ఇవ్వాలని సూచించారు. వారికి వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు అధికారులు తెలిపారు.
👍నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనాకు ఆనందయ్య తయారుచేస్తున్న మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద సంస్థ కమిటీ నివేదిక అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కంట్లో వేస్తున్న మందుకు తప్ప మిగతా మందులకు పచ్చజెండా ఊపింది. ఈ మందు వాడినంత మాత్రాన మిగతా మందులు వాడకుండా ఉండొద్దని ప్రభుత్వం సూచించింది. ఆనందయ్య పంపిణీ చేస్తున్న పీ, ఎల్, ఎఫ్ మందులు వాడొచ్చని తెలిపింది. పంపిణీ కేంద్రం వద్దకు కొవిడ్ రోగులు వెళ్లొద్దని, వారి బంధువులే వెళ్లి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
👍 కరోనా సెకండ్ వేవ్‌తో అనేక రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలవుతుండటంతో అనేక మంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వేతన జీవుల ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు తమ ఈపీఎఫ్‌వో ఖాతా నుంచి అడ్వాన్స్ తీసుకొనేందుకు మరోసారి వీలు కల్పించింది. గతేడాది మార్చిలో కూడా లాక్డౌన్ సమయంలో ఈపీఎఫ్‌వో ఈ వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే.
👍 తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తోంది. కఠిన ఆంక్షలు విధించడంతో ఉభయ రాష్ట్రాల్లో కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలో కొత్త కేసులు భారీగా తగ్గాయి. నిన్న 83,461శాంపిల్స్ పరీక్షించగా.. దాదాపు 8వేల కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న కర్ఫ్యూని జూన్ 10వరకు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు, తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 87,110 నమూనాలను పరీక్షించగా 2,524 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
👍కరోనా కట్టడికి దేశంలోని పలు ప్రభుత్వాలు అమలుచేస్తోన్న లాక్డౌన్ ఆంక్షలు.. కరోనా వైరస్‌తో పాటు ఇతర వ్యాధుల వ్యాప్తిని తగ్గించాయని పరిశోధకులు గుర్తించారు. న్యుమోనియా, మెనింజైటిస్, సెప్సిస్ వంటి బ్యాక్టీరియల్ వ్యాధులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఈ లాక్డౌన్లతో భారీగా ప్రాణాలు నిలిచాయని కూడా చెప్పారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
👍దేశాన్ని వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. దీన్ని అధిగమించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం వ్యాక్సిన్ల మిక్సింగ్ (రెండు వేర్వేరు డోసులు తీసుకోవడం)తో పాటు ఒకే డోసు కొవిషీల్డ్ టీకా ఇవ్వడంపై అధ్యయనం జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. రెండు వేర్వేరు డోసులు కలిపి ఇచ్చే అంశంపై జూన్‌లో అధ్యయనం ప్రారంభం కానున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. రెండు నుంచి రెండున్నర నెలల్లో ఈ పరిశోధన పూర్తి కానున్నట్లు సమాచారం. ఇటీవల పొరపాటున 20 మందికి రెండు వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, వారిలో పెద్దగా దుష్ప్రభావాలేమీ తలెత్తకపోవడంతో వ్యాక్సిన్ మిక్సింగ్‌పై చర్చ ప్రారంభమైంది.
👍కరోనా బారిన పడిన అందరికీ బ్లాక్‌ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్) రాదని కేంద్రం మరోసారి వెల్లడించింది. తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన ఏ వ్యక్తికైనా సోకవచ్చని తెలిపింది. అయితే, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు కలిగి ఉన్నవారిపై దీని ముప్పు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.
👍కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ముగియడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు పొడిగిస్తున్నాయి. బిహార్‌లో మరోసారి లాక్డౌన్ పొడిగించారు. కొన్ని సడలింపులతో జూన్ 8వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం నీతీశ్ కుమార్ ప్రకటించారు. మరోవైపు, ఉత్తరాఖండ్ కూడా లాక్‌డౌన్‌ను జూన్ 9వరకు పొడిగించింది. వారంలో రెండు రోజులు మాత్రమే నిత్యావసరాలు కొనుగోలుకు అవకాశం కల్పించింది. జూన్ 1, 7తేదీల్లో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1గంటవరకు కొనుగోలు చేసుకొనేందుకు వెసులుబాటు కల్పించింది.అలాగే, జూన్ 1న మాత్రమే పుస్తక దుకాణాలు, స్టేషనరీలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్‌లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
-
World News
Rishi Sunak: తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్‌గా ఎవరంటే?
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- China Phones: రూ.12 వేలలోపు చైనా ఫోన్ల నిషేధంపై కేంద్రం వైఖరి ఇదేనా!
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
- Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
- Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
- Karthikeya 2: తప్పే కానీ తప్పలేదు.. ఎందుకంటే ‘కార్తికేయ-2’కి ఆ మాత్రం కావాలి: నిఖిల్