electoral reforms: ‘ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పోలింగ్‌’ కోసం యత్నాలు

మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నికల విధానాల్లో సంస్కరణలు తీసుకురావాలని పార్లమెంటు వ్యవహారాల స్థాయీ సంఘం నిర్ణయించింది......

Published : 01 Nov 2021 23:51 IST

దిల్లీ: మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నికల విధానాల్లో సంస్కరణలు తీసుకురావాలని పార్లమెంటు వ్యవహారాల స్థాయీ సంఘం నిర్ణయించింది. రిమోట్ ఓటింగ్, ఆధార్ అనుసంధానం, అన్ని ఎన్నికలకు ఒకే ఓటరు జాబితా వంటి నిర్ణయాలపై చర్చించేందుకు ఎన్నికల సంఘం ఉన్నాతాధికారులను ఆహ్వానించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు తీర్మానించారు. ఈ వారంలో ఎన్నికల సంఘం అధికారులతో సమగ్రంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం భాజపా సీనియర్ నేత సుశీల్ మోదీ నేతృత్వంలో సోమవారం సమావేశమైంది. రిమోట్ ఓటింగ్, ఒకే ఓటరు జాబితా వంటి పలు అంశాలపై సభ్యులు ఈ సందర్భంగా చర్చించారు. రిమోట్ ఓటింగ్‌ను ప్రవేశ పెడితే.. ఏ ఓటరైనా తమ నియోజకవర్గం వెలుపల నుంచి ఓటును వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. అలాగే, ఆధార్-ఓటర్ కార్డు అనుసంధానం వల్ల పోలింగ్ కేంద్రానికి బహుళ గుర్తింపు కార్డులను తీసుకెళ్లాల్సిన అవసరముండదని అంచనా వేశారు. ఇలా పలు అంశాలపై ఈసీ ఉన్నతాధికారులతో ఈ వారంలో స్థాయీ సంఘం చర్చించే అవకాశముంది. ఈ అంశాలపై చర్చించేందుకు ఇ-కమిటీకి నాయకత్వం వహిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అపాయింట్‌మెంట్ కోరనున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని