Encounter: జమ్ములో ఐదుగురు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన ఐదుగురు మిలిటెంట్లు హతమయ్యారు....

Updated : 02 Jul 2021 18:52 IST

పుల్వామా: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన ఐదుగురు మిలిటెంట్లు హతమయ్యారు. కాగా మృతుల్లో లష్కరే తొయిబాకు చెందిన జిల్లా కమాండర్‌ నిషాజ్‌ లోనే కూడా ఉన్నట్లు ఆర్మీ ఈధికారులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ భారత జవాను తీవ్రంగా గాయపడ్డాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు.

పుల్వామా జిల్లాలోని హజ్నాన్‌ గ్రామంలో సెక్యూరిటీ దళాలు గురువారం అర్ధరాత్రి నుంచి కట్టడి ముట్టడి నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే వారిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భారత జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఆపరేషన్ విజయవంతమైనట్లు కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. లష్కరే తొయిబా జిల్లా కమాండర్‌ నిషాజ్‌ లోనేతోపాటు ఓ పాకిస్థానీ ఉగ్రవాదిని అంతమొందించినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని