Afghanistan: సూసైడ్‌ బాంబర్లపై తాలిబన్‌ హోంమంత్రి ప్రశంసలు.. ఆర్థిక సాయం ప్రకటన!

బాంబులు పేల్చి మారణహోమం సృష్టించే సూసైడ్‌ బాంబర్లపై అఫ్గానిస్థాన్‌ హోంమంత్రి ప్రశంసలు కురిపించారు. వారి త్యాగాలు మరువలేనివని కొనియాడారు.....

Published : 20 Oct 2021 01:15 IST

కాబుల్‌: బాంబులు పేల్చి మారణహోమం సృష్టించే సూసైడ్‌ బాంబర్లపై అఫ్గానిస్థాన్‌ హోంమంత్రి ప్రశంసలు కురిపించారు. వారి త్యాగాలు మరువలేనివని కొనియాడారు. అలా మరణించినవారి కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో తాలిబన్ ప్రభుత్వ హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్‌ హక్కానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూసైడ్‌ బాంబర్లను కొనియాడినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. వారు అమరవీరులని, వారి త్యాగాలు మరువలేనివని హోంమంత్రి పేర్కొన్నట్లు పలు వార్తలు వెలువడ్డాయి. వారి కుటుంబాలకు 125 డాలర్లు, ఓ ప్లాట్‌ను ఇవ్వనున్నట్లు కూడా ఆయన ప్రకటించినట్లు తెలిపాయి.

అఫ్గాన్‌లో వరుస ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. శుక్రవారం ప్రార్థనలే లక్ష్యంగా ఈ నెల 8వ తేదీన ఉత్తర అఫ్గానిస్థాన్‌ కుందుజ్‌ ప్రావిన్స్‌ ప్రాంతంలోని ఓ మసీదులో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో కనీసం 46మంది వరకు దుర్మరణం చెందగా.. అనేకమంది గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ఖాన్‌ అబాద్‌ ప్రాంతంలోని షియాల మసీదును లక్ష్యంగా చేసుకొని ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈనెల 15న కాందహార్‌లోని షియా మసీదులో ఆత్మాహుతి దాడి జరగగా 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని