Youtube: 104 యూట్యూబ్‌ ఛానెళ్లపై కేంద్రం కొరడా

దేశవ్యాప్తంగా 104 యూట్యూబ్‌ చానెళ్లను బ్లాక్‌ చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రాజ్యసభకు తెలిపారు. దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లేలా సమాచారాన్ని పోస్టు చేస్తున్నందున వీటిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

Published : 22 Dec 2022 22:04 IST

దిల్లీ: జాతీయ భద్రతకు విఘాతం కలిగించేలా, తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తున్న104 యూట్యూబ్‌ (youtube) ఛానెళ్లను బ్లాక్‌ చేసినట్లు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) వెల్లడించారు. వీటితోపాటు 45 వీడియోలు, 4 ఫేస్‌బుక్‌ (Facebook), 3 ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram), 5 ట్విటర్‌ ఖాతాలతోపాటు, 6 వెబ్‌సైట్లపైనా నిషేధం విధించినట్లు తెలిపారు. ఈ మేరకు రాజ్యసభ (Rajya Sabha)లో  సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (Information Technology) చట్టంలోని సెక్షన్‌ 69ఏ ప్రకారం.. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేదిగా భావిస్తున్న డిజిటల్‌ కంటెంట్‌ను తొలగించినట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా సదరు ఖాతాలను కూడా తొలగించామన్నారు.

అంతేకాకుండా 2021 నుంచి అక్టోబరు 2022 మధ్య కాలంలో మరో 1,643 మంది యూజర్‌ జనరేటెడ్‌ యూఆర్‌ఎల్స్‌, వెబ్‌ పేజీలను బ్లాక్‌ చేయాల్సిందిగా.. ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసిందని తెలిపారు. డిజిటల్‌ సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడబోమని ఠాకూర్‌ రాజ్యసభకు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని