Mussoori: ఇక్కడకు రావొద్దు..వెనక్కి వెళ్లిపోండి
కరోనా రెండోదశ వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను పలు రాష్ట్రాలు క్రమంగా సడలిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు సందర్శకులు పోటెత్తుతున్నారు. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు..
8000 మంది పర్యాటకులను తిప్పి పంపిన ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్: కరోనా రెండోదశ వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను పలు రాష్ట్రాలు క్రమంగా సడలిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు సందర్శకులు పోటెత్తుతున్నారు. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు.ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నిబంధనలను అతిక్రమించిన వారిని ఉపేక్షించవద్దని జిల్లా మెజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేసింది. వారాంతాల్లో రద్దీని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలో ముస్సోరి, నైనితాల్ ప్రాంతాల నుంచి దాదాపు 8000 మంది పర్యాటకులను ఉత్తరాఖండ్ పోలీసులు వెనక్కి తిప్పి పంపారు. సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. మూడో ముప్పు పొంచి ఉన్న తరుణంలో పరిమిత సంఖ్యలోనే పర్యాటకులను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.
ఇటీవల ఉత్తరాఖండ్‌లోని కెంప్టీ జలపాతం వద్ద సందర్శకుల సందడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కరోనా నిబంధనలను పాటించకుండా జనం గుమిగూడటంపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పర్యాటక ప్రాంతాల్లో కొవిడ్ పరిస్థితులు గతితప్పితే సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ వెళ్లే పర్యాటకులు ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, సీబీనాట్, రాపిడ్ యాంటీజెన్ టెస్టు రిపోర్టులో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. 72 గంటల ముందు పరీక్షించిన రిపోర్టులనే పరిగణనలోకి తీసుకుంటారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు వెల్లడించిన టీఎస్పీఎస్సీ
-
Sports News
Pak Cricket: భారత్ మోడల్‌కు తొందరేం లేదు.. ముందు ఆ పని చూడండి.. పాక్‌కు మాజీ ప్లేయర్ సూచన
-
General News
Taraka Ratna: విషమంగానే తారకరత్న ఆరోగ్యం: వైద్యులు
-
Movies News
Yash: రూ. 1500 కోట్ల ప్రాజెక్టు.. హృతిక్ వద్దంటే.. యశ్ అడుగుపెడతారా?
-
India News
Gorakhnath: గోరఖ్‌నాథ్ ఆలయంలో దాడి.. ముర్తజా అబ్బాసీకి మరణశిక్ష
-
Politics News
KTR: రాజ్‌భవన్‌లో రాజకీయ నాయకుల ఫొటోలు సరికాదు: కేటీఆర్