
దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్..
దిల్లీ: దేశరాజధానిలో కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలో ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. లాక్‌డౌన్ నేటి రాత్రి 10 గంటల నుంచి మొదలై వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకూ అమల్లో ఉండనుంది. ఈ మేరకు కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. కరోనా కట్టడి కోసం చేపడుతున్న చర్యలను వివరించారు. అంతకుముందు లాక్‌డౌన్‌పై కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో సమావేశమై చర్చించారు.
ఈ లాక్‌డౌన్ సమయంలో..
‘దిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా రోజుకు దాదాపు 25వేల కేసుల వరకు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు, ఇన్‌ఫెక్షన్‌లు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడింది. నిత్యం ఈ స్థాయిలో రోగులు వస్తే వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. ఈ ఆరు రోజుల లాక్‌డౌన్ కాలంలో ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచే చర్యలు చేపడతాం. ఈ లాక్‌డౌన్ కాలంలో ఆక్సిజన్, మందులు సమకూర్చే ఏర్పాట్లు చేస్తాం. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరుతున్నా. ఇలాంటి సమయంలో మాకు సాయం చేస్తున్నందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని కేజ్రీవాల్ తెలిపారు.
వారికి చేతులెత్తి మొక్కుతున్నా..
‘లాక్‌డౌన్‌లో భాగంగా నిత్యావసరాలు, ఆహార సంబంధిత, వైద్యం సహా ఇతర అత్యవసర సేవలు కొనసాగుతాయి. ప్రైవేటు కార్యాలయాలన్నీ వర్క్ ఫ్రం హోం ద్వారానే నడిపేలా చర్యలు తీసుకోవాలి. వివాహ వేడుకలు కేవలం 50 మందితో మాత్రమే జరుపుకోవాలి. అందుకు ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తాం. ఇక వలస కూలీల విషయానికొస్తే.. వారికి నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నా. ఇది ఆరురోజుల పాటు కొనసాగే చిన్న లాక్‌డౌన్ మాత్రమే. దయచేసి దిల్లీ వదిలి వెళ్లొద్దు. మళ్లీ దీన్ని పొడిగించాల్సిన అవసరం రాదని నేను భావిస్తున్నా. మిమ్మల్ని ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుంది’ అని కేజ్రీవాల్ భరోసా కల్పించారు.
కాగా, దిల్లీలో ఆదివారం 25,462 కరోనా కేసులు నమోదు కాగా, 161 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం దిల్లీలో పాజిటివిటీ రేటు 30శాతంగా కొనసాగుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటికే దిల్లీలో వారాంతపు లాక్‌డౌన్ కొనసాగుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Telangana News: నేడు హైదరాబాద్‌కు సిన్హా.. నగరంలో తెరాస భారీ ర్యాలీ
-
Movies News
Raashi Khanna: యామినిగా నేను ఎవరికీ నచ్చలేదు: రాశీఖన్నా
-
Politics News
BJP: భాజపా పదాధికారుల సమావేశాలను ప్రారంభించిన నడ్డా
-
Business News
Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఇవి ముందే చూసుకోండి!
-
India News
India Corona: 4 శాతానికి పైగా పాజిటివిటీ రేటు..!
-
India News
Spicejet: క్యాబిన్లో పొగలు.. స్పైస్‌జెట్ విమానం వెనక్కి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- Andhra News: నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య