కరోనా తీరును బట్టే..విమానాల రాకపోకలు

పూర్తిస్థాయిలో విమానాల పునఃప్రారంభం కరోనా వైరస్‌ తీరుపై ఆధారపడి ఉంటుందని విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి వెల్లడించారు.

Published : 10 Feb 2021 14:15 IST

దిల్లీ: పూర్తిస్థాయిలో విమానాల రాకపోకలు కరోనా వైరస్‌ తీరుపై ఆధారపడి ఉంటాయని విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి వెల్లడించారు. కొవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, వైరస్‌లో కొత్త రకాలు వెలుగుచూస్తుండటంతో ప్రపంచం అనిశ్చితి నుంచి బయటపడలేకపోతోంది. ముఖ్యంగా రెక్కలు విరిగిన విమానయాన రంగం..పూర్వస్థితికి చేరుకునేందుకు ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో మంత్రి రాజ్యసభలో స్పష్టత ఇచ్చారు.

‘పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని కొన్ని విమానయాన సంస్థలు మమ్మల్ని కోరుతున్నాయి. మరికొన్ని సంస్థలు పరిస్థితులను గమనించి నెమ్మదిగా ముందుకు వెళ్దామంటున్నాయి. విమానయాన కార్యకలాపాలను 80 శాతానికి పెంచాలనే మా నిర్ణయం.. వైరస్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది’ అని హర్దీప్ రాజ్యసభలో సమాధానమిచ్చారు.

80 శాతం సామర్థ్యంతో దేశీయంగా విమాన కార్యకలాపాలకు కేంద్రం అనుమతించినప్పటికీ.. భారత సంస్థలు మాత్రం తక్కువ సామర్థ్యంతోనే విమానాలను నడుపుతున్నాయి. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై విధించిన నిషేధాన్ని గత నెల డీజీసీఏ ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. అయితే ఎంపిక చేసిన మార్గాల్లో కొన్ని ప్యాసింజర్ విమానాలకు మాత్రం అనుమతులు ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్న తరుణంలో.. గత ఏడాది మార్చిలో కేంద్రం విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. అయితే మే నుంచి వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక విమానాలను నడుపుతోంది. అలాగే ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా జులై నుంచి ఎంపిక చేసిన దేశాల నుంచి రాకపోకలకు అనుమతించింది.

ఇవీ చదవండి:

దేశీ యాప్‌ ‘కూ’లో పీయూష్‌ గోయల్

ట్రంప్‌పై అభిశంసనకు అంగీకరించిన సెనేట్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు