భారత్‌లో 165కి చేరిన యూకే స్ట్రెయిన్‌ కేసులు

దేశంలో యూకే స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య 165కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. గురువారం జరిగిన మంత్రుల బృంద సమావేశంలో ఆయన ప్రసంగించారు.

Published : 28 Jan 2021 18:05 IST

కరోనా సమీక్షా సమావేశంలో వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

దిల్లీ: దేశంలో యూకే స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య 165కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. గురువారం జరిగిన మంత్రుల బృంద సమావేశంలో ఆయన దేశంలో కరోనా పరిస్థితిని సమీక్షించారు. యూకే స్ట్రెయిన్‌ కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల్లో వైరస్‌లో జన్యు మార్పులను  గుర్తించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వారి నమూనాలను పంపుతున్నామని ఆయన తెలిపారు. వాటిలో దిల్లీ (ఎన్‌సీడీసీ)లో 42, దిల్లీ (ఐజీఐబీ)లో 51, బెంగళూరు (ఎన్‌సీబీఎస్‌)లో 5, పుణె (ఎన్‌ఐవీ)లో 44, హైదరాబాద్‌ (సీసీఎంబీ)లో 8, బెంగళూరు (నిమ్‌హాన్స్‌)లో 14, కోల్‌కతా (ఎన్‌ఐబీజీ) ల్యాబుల్లో 1 చొప్పున యూకే స్ట్రెయిన్‌ కేసులను గుర్తించామని తెలిపారు.

దేశంలోని కొన్ని జిల్లాల్లో గత నెల రోజులుగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదవలేదని మంత్రి తెలిపారు. గడచిన 24 గంటల్లో దేశంలో 12వేల కన్నా తక్కువ కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం 1.73లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయన్నారు. మరోవైపు జనవరి 27 నాటికి 23 లక్షలకు పైగా ఆరోగ్యకార్యకర్తలు టీకాలు వేయించుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి..

ముంబయిపై మాకూ హక్కుంది

జాతీయ జెండాను అవమానిస్తే దేశం సహించదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని