Landslides: ఉత్తరాఖండ్‌లో కొండచరియల బీభత్సం.. ఇద్దరు హైదరాబాదీల మృతి

Landslides: ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్‌ వాసులు మృతిచెందారు. వారు వెళ్తున్న బైక్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి.

Updated : 06 Jul 2024 19:04 IST

హైదరాబాద్‌: దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ను (Uttarakhand) వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. చమోలీ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలో (Landslides)  హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికులు (Hyderabad Tourists) మృతిచెందినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.

కర్ణప్రయాగ, గౌచర్‌ మధ్యలోని బద్రీనాథ్‌ నేషనల్ హైవేపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన నిర్మల్‌ షాహీ (36), సత్య నారాయణ (50) బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని బైక్‌పై తిరిగొస్తుండగా.. మార్గమధ్యంలో కొండచరియలు (Landslides) విరిగి వారిపై పడ్డాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

భారీ వర్షాల (Rains in Uttarakhand) కారణంగా ఉత్తరాఖండ్ వ్యాప్తంగా ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అటు కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్‌ నేషనల్ హైవే పలు చోట్ల ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రప్రయాగ్‌-కేదార్‌నాథ్‌ జాతీయ రహదారిపై కూడా రాకపోకలను నిలిచాయి. శని, ఆదివారాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ముందజాగ్రత్త చర్యగా రుద్రప్రయాగ్‌లో అన్ని స్కూళ్లకు నేడు సెలవు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని