Jaishankar : టోర్నమెంట్లు వస్తూనే ఉంటాయి.. భారత్-పాక్ క్రికెట్‌పై జైశంకర్ సమాధానమిదే..!
వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్(Asia Cup 2023)పై భారత్, పాక్ క్రికెట్ బోర్డుల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్(S. Jaishankar) కూడా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్(Asia Cup 2023)పై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్(Pakistan)లో భారత్ పర్యటించేది లేదని ఇప్పటికే బీసీసీఐ(BCCI) కార్యదర్శి జై షా(Jay Shah) చెప్పిన నేపథ్యంలో.. ఇరు దేశాల బోర్డుల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్(S. Jaishankar) కూడా స్పందించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించేవరకూ భారత్-పాక్ మధ్య ఎలాంటి క్రికెట్ సంబంధాలు ఉండబోవని స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన చర్చా వేదికలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘టోర్నమెంట్లు వస్తూనే ఉంటాయి.. అయితే ప్రభుత్వ విధానాలు, వైఖరి ఏంటో మీరు తెలుసుకోవాలి. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇదో క్లిష్టమైన సమస్య. మీ తలపై గన్ పెడితే.. మీరు నాతో మాట్లాడుతారా?. మీ పొరుగువారు బహిరంగంగా ఉగ్రవాదానికి సహాయం అందిస్తుంటే.. అక్కడ నాయకులు ఎవరు? క్యాంపులు ఎక్కడ ఉన్నాయనే దానిలో రహస్యమేముంటుంది. సీమాంతర ఉగ్రవాదమనేది సాధారణ విషయమని మనం ఎప్పుడూ అనుకోకూడదు. పొరుగు దేశాలపైనే ఉగ్రవాదుల్ని ప్రోత్సహించే ఘటనలు ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నాయా? అలాంటిది ఎక్కడా లేదు.. కాబట్టి ఇది అత్యంత అసాధారణమైనది’ అని జై శంకర్ అన్నారు.
ఇక క్రికెట్ గురించి మాట్లాడుతూ..‘క్రికెట్ విషయంలో మా వైఖరేంటో మీకు తెలుసు. ఉగ్రవాదాన్ని ఓ దేశం ప్రోత్సహిస్తుంటే దాన్ని మనం అంగీకరించకూడదు. మేం దీనిపై చర్యలు తీసుకోకపోతే.. ఇది అలాగే కొనసాగుతుంది. కాబట్టి పాక్‌పై ప్రపంచ ఒత్తిడి ఉండాలి. ఉగ్రదాడుల బాధితులు తమ స్వరం వినిపించకపోతే.. పాక్‌పై ఆ ఒత్తిడి రాదు. ఆ దేశంపై ఒత్తిడి తీసుకువచ్చే విషయంలో మేం నాయకత్వం వహిస్తాం. ఎందుకంటే ఉగ్రవాదం వల్ల మనం ఎంతగానో నష్టపోయాం’ అని జైశంకర్ అన్నారు.
జై శంకర్ తాజా వ్యాఖ్యలను పరిశీలిస్తే.. బీసీసీఐ, భారత ప్రభుత్వం ఈ విషయంలో ఒకే వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది పాక్‌లో భారత్ పర్యటించడం సాధ్యం కాకపోవచ్చు. ఇక వచ్చే ఆసియాకప్‌లో భారత్ పాక్‌లో పర్యటించకపోతే.. తాము కూడా భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ టూర్‌కు రాబోమని పీసీబీ చీఫ్ రమీజ్ రజా ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Celebrity Cricket League: సీసీఎల్ మళ్లీ వస్తోంది.. ఆరోజే ప్రారంభం
-
World News
Kim Yo-jong: పశ్చిమ దేశాల ట్యాంకులను రష్యా ముక్కలు చేస్తుంది..!
-
General News
Chandrababu: విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, కుటుంబ సభ్యులు
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్‌బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు