11 నెలల తర్వాత అక్కడ పట్టాలెక్కిన రైలు..

కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో రైలు సర్వీసులు అందుబాటులో లేవు. ఈ క్రమంలో 11 నెలల అంతరాయం తర్వాత కశ్మీర్‌ వ్యాలీలో ..

Published : 22 Feb 2021 23:45 IST

దిల్లీ: కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో రైలు సర్వీసులు అందుబాటులో లేవు. ఈ క్రమంలో 11 నెలల అంతరాయం తర్వాత కశ్మీర్‌ వ్యాలీలో సోమవారం నుంచి రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ రైళ్లను తిరిగి నడపడంతో దేశ పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభిస్తోందని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. దీంతో ‘ఫిబ్రవరి 22 నుంచి కశ్మీర్‌ వ్యాలీలోని బనిహాల్‌-బారాముల్లా వరకు రెండు రైళ్లును తిరిగి ప్రారంభించారు’ అని మంత్రి ట్వీట్‌ చేశారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో భారతీయ రైల్వే శాఖ వీలైనన్ని రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. కేవలం జనవరిలోనే మొత్తంగా 250 రైళ్లను నడపడానికి అనుమతినిచ్చింది. 
దీంతో 65 శాతం కన్నా ఎక్కువ రైళ్లు అందుబాటులో ఉన్నాయని సంబంధిత శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. అయితే దేశంలో రైలు సర్వీసులు పూర్తి స్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది రైల్వే శాఖ ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తోన్న ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. వీటిలో కొన్ని సబర్బన్‌ రైళ్లు కూడా ఉన్నాయని శాఖ వివరించింది. కరోనా వల్ల దేశంలో రైలు సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు