highest rail bridge: చీనాబ్‌ నదిపై చికుబుకు రైలు

జమ్మూకశ్మీర్‌ వెళ్లే పర్యాటకులు తప్పక చూసి వచ్చే అందాల జాబితాలో ఇకపై చీనాబ్‌ రైల్వే వంతెన కూడా చేరనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ వంతెన నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది.

Published : 16 Jun 2024 06:27 IST

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన
జమ్మూకశ్మీర్‌లో త్వరలో అందుబాటులోకి

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌ వెళ్లే పర్యాటకులు తప్పక చూసి వచ్చే అందాల జాబితాలో ఇకపై చీనాబ్‌ రైల్వే వంతెన కూడా చేరనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ వంతెన నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. చీనాబ్‌ నదిపై కట్టిన ఈ రైల్వేబ్రిడ్జి మీదుగా రాంబన్‌ నుంచి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఉత్తర రైల్వేశాఖ వెల్లడించింది. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్‌ - శ్రీనగర్‌ - బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్‌ వంతెనను నిర్మించారు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్‌ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్‌ రైల్వేవంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇందులో భాగంగా కొన్ని టన్నెళ్లు కూడా నిర్మించారు. 

రియాసీకి గేమ్‌ఛేంజర్‌ 

అత్యంత ఎత్తయిన చీనాబ్‌ వంతెనపై రైలులో వెళుతుంటే ‘నేను ఈ ప్రపంచానికే రాజును’ అనే భావన కలగటం ఖాయం. ఆధునిక ప్రపంచంలో ఇది ఒక ఇంజినీరింగ్‌ అద్భుతం. ఈ ట్రాక్, టన్నెళ్లు మహాద్భుతం. ప్రపంచంలో ఎనిమిదో వింతగా అందరూ చెబుతున్న ఈ వంతెనపై రైలు పరుగు మొదలైన రోజు రియాసీ జిల్లాకు ఒక గేమ్‌ఛేంజర్‌ అవుతుంది.

విశేష్‌ మహాజన్, రియాసీ డిప్యూటీ కమిషనర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని