plane crash: దేవాలయాన్ని ఢీకొన్న శిక్షణా విమానం..!

మధ్యప్రదేశలో విమాన ప్రమాదం(plane crash) చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఓ కెప్టెన్‌ ప్రాణాలు కోల్పోయాడు. 

Published : 06 Jan 2023 23:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ శిక్షణా విమానం దేవాలయాన్ని ఢీకొన్న ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో చోటు చేసుకొంది. ఈ ప్రమాదం(plane crash)లో ఒక కెప్టెన్‌ మరణించగా.. ట్రైనీ పైలట్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నిన్న రాత్రి 11.30 సమయంలో చోటు చేసుకొంది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి మూడు కిలోమీటర్ల దూరంలో చోర్హాట్టా ఎయిర్‌ స్ట్రిప్‌ ఉంది.

శిక్షణలో భాగంగా గాల్లోకి లేచిన ఈ విమానం ఓ దేవాలయ గోపురాన్ని, ఓ చెట్టును ఢీకొంది. ఈ విషయాన్ని చోర్హట్టా పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన(plane crash)లో పట్నాకు చెందిన కెప్టెన్‌ విమల్‌ కుమార్‌ (50) మరణించగా.. ట్రైనీ పైలట్‌ సోను యాదవ్‌ (23) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిది జైపుర్‌గా గుర్తించారు. అతడిని సంజయ్‌గాంధీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు రేవా కలెక్టర్‌ మనోజ్‌ పుష్ప తెలిపారు. ప్రమాదానికి గురైన విమానం  ఫాల్కన్‌ ఏవియేషన్‌ అకాడమీకి చెందినదిగా కలెక్టర్‌ పేర్కొన్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఓ టెక్నికల్‌ బృందం రేవాకు బయల్దేరినట్లు మధ్య ప్రదేశ్‌ హోంశాఖ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు. చర్హోట్టాలోని ఓ ప్రైవేటు విమాన శిక్షణ సంస్థ ఎయిర్‌ స్ట్రిప్‌ నుంచి ఇది గాల్లోకి ఎగిరినట్లు పేర్కొన్నారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని