Supreme Court: 15ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం.. పెళ్లికి అనుమతివ్వాలంటూ ఇద్దరు అబ్బాయిల పిటిషన్‌

తాము గత 15 ఏళ్లుగా ప్రేమబంధంలో ఉన్నామని.. తమ వివాహానికి చట్టబద్ధత కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది ఓ స్వలింగ సంపర్క జంట.

Updated : 04 Feb 2023 07:53 IST

 

తాము గత 15 ఏళ్లుగా ప్రేమబంధంలో ఉన్నామని.. తమ వివాహానికి చట్టబద్ధత కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది ఓ స్వలింగ సంపర్క జంట. ఉత్కర్ష్‌ సక్సేనా, అనన్య కోటియా విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. స్వలింగ సంపర్క వివాహం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును కోరారు. వారితో పాటు మరో ముగ్గురు తమ పెళ్లిలకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేయగా.. వీటన్నింటినీ మార్చిలో విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.  ఈ వివాహాలకు చట్టబద్ధత లభిస్తే.. తైవాన్‌ తర్వాత స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసిన రెండో ఆసియా దేశంగా భారత్‌ నిలవనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని