Facebook: వీడియో చూసి.. స్పందించిన సీఎం

సాయం కోరుతూ ఎనిమిదో తరగతి విద్యార్థిని  ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టుపై త్రిపుర సీఎం బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ స్పందించారు. ఆమె కోరిన స్టడీ టేబుల్‌, ఆమె తల్లికోసం అవసరమైన మందులు, కొన్ని ఆహారపదార్థాలను ఆమె ఇంటికే పంపించి అందర్నీ...

Published : 05 Jun 2021 20:36 IST

అగర్తల: సాయం కోరుతూ ఎనిమిదో తరగతి విద్యార్థిని ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టుపై త్రిపుర సీఎం విప్లవ్‌ కుమార్‌ దేవ్ స్పందించారు. ఆమె కోరిన స్టడీ టేబుల్‌, ఆమె తల్లికోసం అవసరమైన మందులు, కొన్ని ఆహార పదార్థాలను ఆమె ఇంటికే పంపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. వివరాల్లోకి వెళ్తే.. అగర్తల నగర శివారులోని బర్షాదాస్‌ అనే విద్యార్థినిది చాలా బీద కుటుంబం. ఓ చిన్న పూరిగుడిసెలో నివాసం ఉంటున్నారు. తండ్రి ఏదో చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.

ఇటీవలే ఆమె తల్లికి కరోనా సోకి మంచాన పట్టింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని సాయం కోరుతూ బర్షాదాస్‌ ఫేస్‌బుక్‌లో వీడియో పోస్టు చేసింది. తన పరిస్థితిని వివరించి ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. అంతకు వారం రోజుల ముందే ఇంట్లో సరైన వసతులు లేనికారణంగా చదువుకోలేకపోతున్నానని, ఓ స్టడీ టేబుల్‌ను అందించాలని కోరుతూ మరో వీడియోను బర్షాదాస్‌ పోస్టు చేసింది. ఈ రెండు వీడియోలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో వెంటనే.. ఆ కుటుంబానికి తగిన సాయం చేయాల్సిందిగా అధికారులును ఆదేశించారు. దీంతో జిల్లా స్థాయి అధికారులు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి స్టడీటేబుల్‌, కొన్ని మందులు, ఆహార పదార్థాలు అందించారు. ముఖ్యమంత్రి సాయంపై బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని