pineapples: బంగ్లా ప్రధానికి 500 కేజీల పైనాపిల్స్‌ గిఫ్ట్‌గా పంపిన త్రిపుర సీఎం

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకు 500 కిలోల పైనాపిల్స్‌ను గిఫ్ట్‌గా పంపారు.

Published : 23 Jun 2024 22:20 IST

అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనాకు పైనాపిల్స్‌ను కానుకగా పంపారు. ఇరు దేశాల మధ్య  సంబంధాలు మరింతగా మెరుగుపడేలా గౌరవ సూచికంగా ఆమెకు 500 కిలోల క్వీన్‌ పైనాపిల్స్‌ని పంపారు. అఖుర ఇంటెగ్రేటెడ్‌ చెక్‌ పోస్ట్‌ (ICP) ద్వారా ఈ పండ్లను బంగ్లాదేశ్‌కు చేరవేసినట్లు అధికారులు వెల్లడించారు. ‘‘సీఎం ఆదేశాల మేరకు 500 కిలోల ‘క్వీన్‌ పైనాపిల్స్‌’ను బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనాకు పంపాం. 100 ప్యాకెట్లలో ఈ పండ్లను పెట్టి తరలించాం. ఒక్కో ప్యాకెట్‌లో 6 పండ్లు, ఒక్కో పండు బరువు 750 గ్రాముల చొప్పున ఉన్నాయి. ’’ అని త్రిపుర ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ దీపక్‌ బైద్య వెల్లడించారు.

వరుసగా కుప్పకూలుతున్న వంతెనలు.. ఆందోళనలో ప్రజలు

భారత్‌, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఎప్పటినుంచో ఉన్నాయని బైద్య తెలిపారు. పరస్పరం గౌరవ భావంతో చేసే ఇలాంటి చర్యల వల్ల సంబంధాలు మరింతగా మెరుగుపడతాయన్నారు. గతేడాది కూడా త్రిపుర సీఎం మాణిక్‌ సాహా షేక్‌ హసీనాకు పైనాపిల్స్‌ పంపించగా.. ఎంతో సంతోషం వ్యక్తం చేసిన ఆమె తిరిగి మామిడి పండ్లను ముఖ్యమంత్రికి పంపించి తన అభిమానాన్ని చాటుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని