Trump: ‘ట్రూత్‌ సోషల్‌’.. ట్రంప్‌ సొంత సోషల్‌ మీడియా..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సొంతగానే సోషల్‌ మీడియాను ప్రారంభించనున్నట్లు బుధవారం ప్రకటించారు. అమెరికాలో క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాలు ఆయన్ను బహిష్కరించాయి.

Updated : 07 Dec 2021 14:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సొంతగానే సోషల్‌ మీడియాను ప్రారంభించనున్నట్లు బుధవారం ప్రకటించారు. అమెరికాలో క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాలు ఆయన్ను బహిష్కరించాయి. దాదాపు తొమ్మిది నెలల పాటు ఆయన ఇంటర్నెట్‌లో చురుగ్గా లేరు. ఇందుకోసం ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌(టీఎంటీజీ)ను ఏర్పాటు చేశారు.   

టీఎంటీజీ సంస్థ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ట్రూత్‌ సోషల్‌’ పేరుతో టీఎంటీజీ సామాజిక మాధ్యమాన్ని ఏర్పాటు చేయనుందని దానిలో పేర్కొంది. కొంత మంది అతిథుల కోసం వచ్చే నెల దాని బీటా వెర్షన్‌ ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ప్రీ ఆర్డర్ల కోసం ఇది ఇప్పటికే యాపిల్‌ ‘యాప్‌స్టోర్‌’లో అందుబాటులో ఉందని తెలిపింది. వీడియో ఆన్‌ డిమాండ్‌ సేవలను కూడా ప్రారంభించాలని ఈ కంపెనీ భావిస్తోంది. ఈ కంపెనీ విలువను ప్రాథమికంగా 875 మిలియన్‌ డాలర్లుగా పేర్కొన్నారు. భవిష్యత్తులో వ్యాపారాన్ని బట్టి ఇది మరింత పెరుగుతుందని అంచనా వేశారు.    

‘‘ క్రూరమైన భారీ టెక్‌ కంపెనీలకు వ్యతిరేకంగా నేను ‘ట్రూత్‌ సోషల్‌’, ‘టీఎంటీజీ’లను ఏర్పాటు చేశాను. తాలిబన్లు ట్విటర్‌ను విపరీతంగా వాడుతున్న ప్రపంచంలో మనం ఉన్నాము. కానీ, అదే ట్విటర్‌లో మీరు ఎంతో ప్రేమించే అమెరికా అధ్యక్షుడి నోరునొక్కేశారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని ట్రంప్‌ పేర్కొన్నట్లు ఆ ప్రకటనలో ఉంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని