మోదీ ప్రసంగం ప్రస్తావనతో ట్రంప్ ప్రచారం
వాషింగ్టన్: ప్రధాని మోదీ ప్రసంగమే ప్రధాన ఆకర్షణగా ఎన్నికల ప్రచార వీడియోను రిపబ్లికన్ పార్టీ విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనుండడంతో ‘మరో నాలుగేళ్లు’ పేరుతో 107 సెకన్ల నిడివిగల తొలి ప్రచార వీడియోను ఆవిష్కరించింది. ఇండియన్-అమెరికన్ ఓటర్లను ఆకర్షించాలన్న లక్ష్యంతో దీన్ని రూపొందించింది. గతంలో హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ బహిరంగ సభలో మోదీ చేసిన ప్రసంగంలోని పలు అంశాలను ఇందులో పొందుపరిచింది. ‘‘ఈయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈయనను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపుగా ప్రతి సమావేశంలోనూ ఈయన పేరు ప్రస్తావనకు వస్తుంది’’ అంటూ ప్రజల హర్షామోదాల మధ్య మోదీ అన్న మాటలతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. ‘‘ఈయనను నా కుటుంబానికి పరిచయం చేస్తున్నాను’’ అంటూ ఇండియన్-అమెరికన్లను ఉద్దేశించి మోదీ అన్న మాటలకు కూడా ప్రాధాన్యం లభించింది. అహ్మదాబాద్‌లో ట్రంప్ చేసిన ప్రసంగం వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ‘‘అమెరికా భారత్‌ను ప్రేమిస్తుంది. గౌరవిస్తుంది. భారత్ ప్రజలకు ఎల్లప్పుడూ నమ్మకమైన స్నేహితునిగా ఉంటుంది’’ అంటూ ట్రంప్ చేసిన ప్రసంగం దీంట్లో ఉంది. అమెరికన్-ఇండియన్లు అమెరికా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, వారంతా అద్భుతమైన వ్యక్తులంటూ ప్రశంసించిన మాటలను కూడా ఇందులో పొందుపరిచారు. దీనిని ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ సహ ఛైర్మన్ అల్ మాసన్ ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా ఇండియన్ అమెరికన్లు డెమొక్రాటిక్ పార్టీకి ఓటు వేస్తుంటారని, కానీ ఈసారి రిపబ్లికన్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. మోదీ, ట్రంప్‌ల మధ్య ఉన్న స్నేహమే ఇందుకు కారణమని చెప్పారు.
నేటి నుంచి రిపబ్లికన్ పార్టీ సదస్సు
రిపబ్లికన్ పార్టీ నాలుగు రోజుల జాతీయ సదస్సు సోమవారం రాత్రి ప్రారంభం కానుంది. ట్రంప్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించనున్నారు. రోజుకు ఒక అంశంపై నాయకుల ప్రసంగాలు ఉండనున్నాయి.
ట్రంప్‌నకు విలువల్లేవు: సోదరి
ట్రంప్‌నకు విలువల్లేవని ఆయన అక్క మేరీ అన్నే ట్రంప్ బారీ (83) వ్యాఖ్యానించారు. ఆమె ఫెడరల్ జడ్జిగా పనిచేశారు. ట్రంప్ జీవితంపై ఇటీవల పుస్తకం రాసి విడుదల చేసిన ఆయన సోదరుని కుమార్తె మేరీ ట్రంప్ ఈ వ్యాఖ్యలను రికార్డు చేశారు. ట్రంప్ గురించి వివరాలు సేకరించిన మేరీ చట్టబద్ధమైన వివాదాలు లేకుండా చూసుకోవడం కోసం వాటిని రికార్డు చేశారు. ఈ రికార్డులు శనివారం బహిర్గతమయ్యాయి. తమ్ముడి వ్యవహార శైలిని తప్పుపడుతూ ఆమె పలువిషయాలు చెప్పారు. ఆయన సరిగ్గా చదువుకోలేదని కూడా అన్నారు.
అమెరికాలో కీలకంగా మనోళ్లు
ఈటీవీ భారత్‌తో మాజీ రాయబారి మీరాశంకర్
దిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్-అమెరికన్ల పాత్ర కీలకంగా మారింది. అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీతో పాటు, ప్రతిపక్ష డెమొక్రాటిక్ కూడా వారి ఓట్లపై కన్నేశాయి. డెమొక్రాటిక్ పార్టీ అయితే ఏకంగా భారత మూలాలు ఉన్న కమలాహారీస్‌ను ఉపాధ్యక్ష పదవికి నిలబెట్టింది. ఓట్లపరంగా చూస్తే ఇండియన్-అమెరికన్ల సంఖ్య పెద్ద ఎక్కువమీ కాదు. కానీ ప్రచారంలో అధిక ప్రాధాన్యం లభిస్తోంది. ఇందుకు దారితీసిన పరిస్థితులపై అమెరికాలో మాజీ భారత రాయబారి మీరా శంకర్ విశ్లేషించారు. ఆమె ‘ఈటీవీ భారత్’తో మాట్లాడుతూ ‘‘అమెరికన్-ఆఫ్రికన్ జార్జి ఫ్లాయిడ్ పోలీసుల చేతిలో మరణించిన తరువాత ‘నల్లవారి జీవితాలూ ముఖ్యమే’ పేరుతో ఉద్యమం నడుస్తోంది. దాంతో జాతి అనేది ఎన్నికల అంశంగా మారింది. దానికి మించి అమెరికా విలువలు, విధానాల ప్రకారం అందరికీ అవకాశాలు కల్పించాలన్నది కూడా ప్రాధాన్యం పొందింది. ఇండియన్-అమెరికన్ ఓట్లు కేవలం 4.7 శాతమే. ఇది అధికసంఖ్య కాదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ రాష్ట్రాలు చూపించే మొగ్గు ఆధారంగా విజయావకాశాలు ఉంటాయి. పార్టీలకు భారీగా విరాళాలు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు ఆధిపత్యం వహిస్తున్నారు. అందుకే అన్ని పార్టీలకూ ముఖ్యమైన ఓటర్లుగా మారారు’’ అని వివరించారు. కశ్మీర్ విషయంలో కమలాహారీస్ బహిరంగంగానే మోదీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు, ఆ పార్టీవారు మానవ హక్కులకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు...మరోవైపు మోదీ-ట్రంప్‌ల మధ్య స్నేహం ఉంది... ఇలాంటి సందర్భాల్లో ఉభయ దేశాల సంబంధాలు ఎలా ఉంటాయన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘‘చైనా సవాళ్ల దృష్ట్యా ఏ పార్టీ అయినా భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలు నెలకొల్పాల్సి ఉంటుంది. డెమొక్రాటిక్ పార్టీ మానవ హక్కులకు అధిక ప్రాధాన్యం ఇచ్చినా, కీలక ప్రయోజనాలను కాదనదు. హెచ్1-బీ వీసాలు, దిగుమతులపై పన్నులు విధిస్తూ ట్రంప్ భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. వీటన్నింటినీ భారత ప్రభుత్వం ప్రాధాన్యక్రమంలో పరిష్కరించుకోవాలి’’ అని వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
AP TET: పార్వతీపురం అభ్యర్థికి చెన్నైలో టెట్ పరీక్ష కేంద్రం
-
Ts-top-news News
NIT Warangal: 3 వేలలోపు ర్యాంకులకే కంప్యూటర్ సైన్స్ సీటు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
-
India News
75th Independence Day: ఎర్రకోట వేడుకల్లో.. అత్యాధునిక తుపాకులతో ‘గన్ సెల్యూట్’
-
World News
Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- Pancreatitis: కడుపులో నొప్పిగా ఉంటుందా..? ఇది ఎలా వస్తుందో తెలుసా..
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు