అతడు గెలిస్తే.. చైనా గెలిచినట్లే: ట్రంప్‌

ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికలో సరైన వ్యక్తిని ఎంచుకోవటం చాలా సులభమని రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. తన ప్రత్యర్థి జో బైడెన్‌ గెలిస్తే చైనా గెలిచినట్టేనని.. అదే తాను గెలిస్తే అమెరికా.........

Published : 14 Oct 2020 17:32 IST

వాషింగ్టన్‌: ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికలో సరైన వ్యక్తిని ఎంచుకోవటం చాలా సులభమని రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. తన ప్రత్యర్థి జో బైడెన్‌ గెలిస్తే చైనా గెలిచినట్టేనని.. అదే తాను గెలిస్తే అమెరికా గెలిచినట్లనే కొత్త వాదనతో ముందుకొచ్చారు. ఇక నిర్ణయం మీదేనంటూ పెన్సిల్వేనియాలోని జోన్స్‌టౌన్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

బైడెన్‌ అధ్యక్షుడైతే చైనాపై ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తాడని, దాంతో ఆ దేశ నకిలీ ఉత్పత్తులు అమెరికాను ఆక్రమిస్తాయని ట్రంప్‌ హెచ్చరించారు. బైడెన్‌ తమకు దాసోహం అవుతాడనే ఉద్దేశంతోనే అతడు గెలవాలని చైనా కోలుకుంటోందని ట్రంప్‌ వివరించారు. చైనాను ఎదుర్కోవాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్న అధ్యక్షుడు.. బైడెన్‌ది ‘నిద్రమొహం’ అని వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారు. నవంబర్‌ 3న జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకం కానున్న రాష్ట్రాల్లో పెన్సిల్వేనియా ఒకటి. కాగా.. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ట్రంప్‌.. ఇక్కడి విమానాశ్రయంలో దిగినప్పుడు కూడా మాస్క్‌ ధరించకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని