డొనాల్డ్‌ ట్రంప్‌కు కొత్త చిక్కులు! 

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై సెనేట్‌లో అభిశంసన వీగిపోయిందనుకునే సరికి మరో చిక్కులో పడ్డారు. జనవరి 6న క్యాపిటల్‌పై దాడిని ప్రోత్సహించడం ద్వారా ట్రంప్‌ ‘కూ క్లుక్స్‌ క్లాన్‌’ చట్టం అతిక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీనియర్‌ డెమోక్రాటిక్‌ నేత బిన్నీ థాంప్సన్‌ ఫెడరల్‌ కోర్టులో కేసు పెట్టారు.

Updated : 17 Feb 2021 12:05 IST

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై సెనేట్‌లో అభిశంసన వీగిపోయిందనుకునే సరికి మరో చిక్కులో పడ్డారు. జనవరి 6న క్యాపిటల్‌పై దాడిని ప్రోత్సహించడం ద్వారా ట్రంప్‌ ‘కూ క్లుక్స్‌ క్లాన్‌’ చట్టం అతిక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీనియర్‌ డెమోక్రటిక్‌ నేత బిన్నీ థాంప్సన్‌ ఫెడరల్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ట్రంప్‌తో పాటు, ఆయన న్యాయవాది రూడి గిల్యానీ సహా వారి మద్దతుదారులూ చట్టాన్ని ఉల్లంఘించారని బిన్నీ థాంప్సన్‌ పేర్కొన్నారు. ఈ ‘కూ క్లుక్స్‌ క్లాన్’ లేదా ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌‌’ చట్టం ఆఫ్రికన్‌ అమెరికన్ల ఓటు హక్కులకు రక్షణ కల్పించేలా ఆ దేశ అధ్యక్షుడికి అధికారాలు కల్పిస్తూ.. 1871 సివిల్‌ వార్‌ సమయంలో ఏర్పడింది.

‘అమెరికా అధ్యక్షుడిగా కాంగ్రెస్‌లో బైడెన్‌ ధ్రువీకరణ ప్రక్రియలో భాగంగా నా కర్తవ్యాన్ని నిర్వహించకుండా ఉండేందుకు వారు బెదిదింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా అధ్యక్షుడిగా బైడెన్‌ ధ్రువీకరణ ప్రక్రియను వ్యతిరేకిస్తూ క్యాపిటల్‌ భవంనపై దాడి చేస్తూ.. 1871 ‘కూ క్లుక్స్‌ క్లాన్‌’ చట్టాన్ని ఉల్లంఘించారు. ట్రంప్‌, ఆయన న్యాయవాది గిల్యానీ సహా రెండు ఇతర గ్రూపులు హింసాత్మక అల్లర్లతో కాంగ్రెస్‌ సభ్యులకు తీవ్రమైన ముప్పును సృష్టించాయి’ అని థాంప్సన్‌ ఆరోపించారు. 

కాగా క్యాపిటల్‌పై దాడి వ్యవహారంలో సెనేట్‌లో రెండో అభిశంసన నుంచి ట్రంప్‌ ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. వంద మంది సభ్యులున్న సెనేట్‌లో ట్రంప్‌పై అభిశంసనకు అనుకూలంగా 57మంది, వ్యతిరేకంగా 43 మంది ఓటేశారు. దీంతో సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ట్రంప్‌పై అభిశంసన అభియోగాలు వీగిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని