ట్రంప్‌ హోటల్‌కు ₹87కోట్ల జరిమానా?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ఒక హోటల్‌ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించిందట. దీంతో భారీ మొత్తంలో జరిమానా విధించాలని ప్రభుత్వ అధికారులు కోర్టును కోరారు. కోర్టు కూడా విచారణ పూర్తి చేసి త్వరలో జరిమానా విధించేందుకు సిద్ధమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. చికాగోలోని

Published : 08 Feb 2021 18:19 IST

చికాగో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ఒక హోటల్‌ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించిందట. దీంతో భారీ మొత్తంలో జరిమానా విధించాలని ప్రభుత్వ అధికారులు కోర్టును కోరారు. కోర్టు కూడా విచారణ పూర్తి చేసి త్వరలో జరిమానా విధించేందుకు సిద్ధమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. చికాగోలోని ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌ అండ్‌ టవర్‌ గత కొన్నాళ్లుగా ప్రభుత్వ అనుమతులు లేకుండా చికాగో నది నుంచి మిలియన్ల కొద్దీ లీటర్ల నీటిని వినియోగిస్తుందట. వెంటిలేషన్‌ కూలింగ్‌, వేడినీళ్ల కోసం.. ఏసీ సిస్టమ్స్‌ కోసం రోజుకు దాదాపు 20 మిలియన్‌ గ్యాలన్ల నదీ నీళ్లను వినియోగిస్తుందని ఆరోపణలు వచ్చాయి. అలాగే 35డిగ్రీలకు మించిన వేడి నీటిని తిరిగి నదిలోకి పంపడం, నీళ్ల సేకరణ కోసం ఏర్పాటు చేసిన ఫిల్టర్ల వల్ల చేపలు చనిపోతున్నాయట. 

అయితే, నదీ.. వాటిలోని చేపల సంరక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలను ట్రంప్‌ టవర్‌ ఉల్లంఘిస్తున్నట్లు 2018లోనే వార్తలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు కావడంలో కోర్టులో విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర అటార్నీ జనరల్‌ క్వామే రౌల్‌ ఈ కేసుపై వాదనలు వినిపిస్తూ చట్టాలను ఉల్లంఘిస్తున్న ట్రంప్‌ టవర్స్‌పై జరిమానా విధించాలని కోరారు. జరిమానా మొత్తం దాదాపు 12 మిలియన్‌ డాలర్లు(రూ.87కోట్లు) ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు గత నెలలోనే తీర్పు వెల్లడించింది. ట్రంప్‌ భవనం  పర్యావరణ సంరక్షణ చట్టం,  కాలుష్య నియంత్రణ బోర్డు నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టం చేసింది. మార్చిలో విచారణ పూర్తి చేసి జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. 

ఇదీ చదవండి..

న్యూయార్క్‌ అసెంబ్లీలో కశ్మీర్‌ తీర్మానం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని