ట్రంప్‌పై ట్విటర్ శాశ్వత నిషేధం!
సామాజిక మాధ్యమం ట్విటర్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను శాశ్వతంంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది............
వాషింగ్టన్: సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన తన సందేశాల ద్వారా మరింత హింసను ప్రోత్సహించే ప్రమాదముందని పేర్కొంది. ఇటీవల ఆయన చేసిన ట్వీట్లను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్ ఖాతాలను 12 గంటల పాటు స్తంభింపజేస్తున్నట్లు ట్విటర్‌తో పాటు ఫేస్బుక్ ప్రకటించాయి. తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన వీడియో సహా మూడు ట్వీట్లను నిలిపివేసింది. బైడెన్ బాధ్యతలు స్వీకరించే రోజువరకూ ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. తాజాగా ట్విటర్ శాశ్వత నిషేధాన్ని విధించగా.. ఫేస్బుక్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
సొంత మాధ్యమం ద్వారా వస్తా..
తన వ్యక్తిగత ఖాతాను నిషేధించడంతో అధ్యక్షుడి అధికారిక ట్విటర్(ప్రెసిడెంట్ ట్రంప్) ద్వారా ట్రంప్ స్పందించారు. ట్విటర్ వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తోందని వ్యాఖ్యానించారు. డెమోక్రాట్లు, ర్యాడికల్ లెఫ్ట్‌తో ట్విటర్ ఉద్యోగులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తనతో పాటు తనకు ఓటేసిన 7.5 కోట్ల మంది గళాన్ని నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ట్విటర్ ఓ ప్రైవేట్ కంపెనీ అని.. ప్రభుత్వం దఖలు పరిచే సెక్షన్ 230 లేకుంటే వారు ఎక్కువకాలం మనుగడ సాగించలేరని చెప్పుకొచ్చారు. ఇతర వెబ్సైట్లతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. త్వరలో ఓ భారీ ప్రకటన ఉండే అవకాశం ఉందన్నారు. సొంతంగా ఓ సామాజిక మాధ్యమాన్ని రూపొందించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. తమ గళాన్ని ఎవరూ నొక్కేయలేరని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్లను కూడా ట్విటర్ వెంటనే తొలగించడం గమనార్హం. ‘ప్రెసిడెంట్ ట్రంప్’ ప్రభుత్వ ట్విటర్ ఖాతా కావడంతో నిషేధం విధించలేకపోయింది.
‘టీమ్ ట్రంప్’ పైనా నిషేధం..
‘ప్రెసిడెంట్ ట్రంప్’ ఖాతాలోని ట్వీట్లను కూడా తొలగించడంతో అధ్యక్షుడు ట్రంప్ ‘టీమ్ ట్రంప్’ ఖాతాని ఉపయోగించుకున్నారు. తిరిగి అవే వ్యాఖ్యల్ని ఈ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన ట్విటర్ ‘టీమ్ ట్రంప్’ను కూడా నిషేధించింది.
ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. నిమిషాల వ్యవధిలో పదుల సంఖ్యలో ట్వీట్లు చేసేవారు. తన నిర్ణయాలు, అభిప్రాయాలు వెలిబుచ్చడానికి ట్విటర్‌ను విస్తృతంగా వినియోగించుకునేవారు. తనకు అనుకూలంగా ఉన్న మీడియా కథనాలు, అధికారుల వ్యాఖ్యల్ని రీట్వీట్ చేసేవారు. ఆయనపై వచ్చే ఆరోపణలన్నింటికీ ట్విటర్ వేదికగానే సమాధానమిచ్చేవారు.
ఇవీ చదవండి...
‘క్యాపిటల్’పై దాడిని ఖండించిన ఇండియన్-అమెరికన్లు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్