ఆ దేశాలపై నిషేధాజ్ఞలు పునరుద్ధరించండి: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక సూచన చేశారు. దేశాన్ని ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి సురక్షితంగా కాపాడేందుకు పలు దేశాలపై ప్రయాణ నిషేధ ఆంక్షల్ని విధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్రంప్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. 

Updated : 20 Apr 2021 11:33 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక సూచన చేశారు. అమెరికాను ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి సురక్షితంగా కాపాడేందుకు పలు దేశాలపై ప్రయాణ నిషేధ ఆంక్షల్ని విధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్రంప్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.

‘అధ్యక్షుడు బైడెన్‌ దేశాన్ని ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి కాపాడాలని అనుకుంటే.. పలు దేశాలపై ప్రయాణ నిషేధాన్ని పునరుద్ధరించాలి. దాంతో పాటు శరణార్థులకు ఆశ్రయం కల్పించే విషయంపైనా గతంలో నేను తీసుకువచ్చిన ఆంక్షల్ని అమలులోకి తేవాలి. ప్రస్తుతం ఉగ్రవాద కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్‌ వేదికగా నియామకాలు జరుగుతున్నాయి. ఉగ్రవాదాన్ని మన దేశం నుంచి నిర్మూలించడానికి మనం కొంత తెలివిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కొన్ని నిబంధనల్ని అమలులోకి తేవాలి. యూరప్‌ చేసిన ఇమ్మిగ్రేషన్‌ తప్పుల్ని మనం తిరిగి చేయకూడదు’ అని ట్రంప్‌ తెలిపారు.

ట్రంప్‌ హయాంలో ముస్లిం దేశాలైన ఇరాన్‌, ఇరాక్‌, లిబియా, సోమాలియా, సూడాన్‌, సిరియా, యెమెన్‌ దేశాలపై ప్రయాణ నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. కానీ బైడెన్‌ అధికారంలోకి వచ్చాక ట్రంప్‌ ఆదేశాల్ని ఎత్తివేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని