వరుస భూకంపాలతో వణికిపోయిన న్యూజిలాండ్‌

గంటల వ్యవధిలో వెంటవెంటనే సంభవించిన మూడు భారీ భూకంపాలతో న్యూజిలాండ్‌ వణికిపోయింది. పసిపిక్‌ మహా సముద్రంలో 8.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకముందు 7.4, 7.3 తీవ్రతతో మరో రెండు భూకంపాలు సంభవించాయి....

Published : 05 Mar 2021 17:32 IST

వెల్లింగ్టన్‌: గంటల వ్యవధిలో వరుసగా సంభవించిన మూడు భారీ భూకంపాలతో న్యూజిలాండ్‌ వణికిపోయింది. పసిఫిక్‌ మహా సముద్రంలో 8.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు 7.4, 7.3 తీవ్రతతో మరో రెండు భూకంపాలు సంభవించాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ భూకంపాల నేపథ్యంలో న్యూజిలాండ్‌తోపాటు అమెరికాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాగా కొద్దిసేపటి తర్వాత అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం వాటిని ఉపసంహరించింది. న్యూజిలాండ్‌లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో పలు నగరాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. భూకంప భయంతో ప్రజలు రాత్రంతా ఇళ్ల బయటే గడిపారు. మొదటి భూకంపం న్యూజిలాండ్‌లోని కెర్మాడిక్‌ దీవుల వద్ద సముద్రంలో 21 కిలోమీటర్ల లోతులో, రెండోది 19 కి.మీ లోతున సంభవించినట్లు అమెరికా భూ భౌతిక సర్వే కేంద్రం తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని