Fuel Tanker Explosion: ఇంధన ట్యాంకర్‌ పేలి 20 మంది మృతి..ఎక్కడంటే?

లెబనాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భారీ ఇంధన ట్యాంకు పేలింది. ఈ దుర్ఘనలో 20 మంది చనిపోయారు. మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు....

Updated : 15 Aug 2021 15:22 IST

లెబనాన్‌: లెబనాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భారీ ఇంధన ట్యాంకు పేలింది. ఈ దుర్ఘటనలో 28 మంది చనిపోయారు. మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం వేకువజామున జరిగినట్లు లెబనాన్‌ రెడ్‌ క్రాస్‌ వెల్లడించింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.

లెబనాన్‌లో తీవ్ర ఇంధన కొరత నెలకొంది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. డీజిల్‌, పెట్రోల్‌ కోసం పెద్దఎత్తున గొడవలు చెలరేగుతుండడంతో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ట్యాంకర్లను, పెట్రోల్‌ బంకులను లెబనాన్‌ ఆర్మీ తమ అధీనంలోకి తీసుకుంది. ఈ క్రమంలో ఓ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్న సైనికులు.. ఇంధనాన్ని పంపిణీ చేస్తుండగా.. ఈ ఘటన సంభవించింది. పేలుడు జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో దాదాపు 200 మంది ఉన్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని