Twitter: అయిదు రాష్ట్రాల ఎన్నికలు.. ట్విటర్‌ ఏం చేయనుందంటే!

అయిదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఓటర్లలో చైతన్యం తీసుకురావడంతోపాటు పోల్స్‌ సమాచారాన్ని వారి ముందుంచేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ‘ట్విటర్‌’ సన్నద్ధమవుతోంది. ఎన్నికలకు సంబంధించిన విశేషాలు, అధికారిక వివరాలను అందుబాటులో...

Published : 14 Jan 2022 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అయిదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఓటర్లలో చైతన్యం తీసుకురావడంతోపాటు పోల్స్‌ సమాచారాన్ని వారి ముందుంచేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ‘ట్విటర్‌’ సన్నద్ధమవుతోంది. ఎన్నికలకు సంబంధించిన విశేషాలు, అధికారిక వివరాలను అందుబాటులో ఉంచేందుకు ఆయా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంస్థ గురువారం తెలిపింది. ఓపెన్ ఇంటర్నెట్ ఆధారిత ఈ కార్యక్రమాలు.. అధిక ఓటింగ్ శాతం నమోదయ్యేలా ప్రోత్సహించడంతోపాటు ఎన్నికల వాతావరణంలో ఓటర్లను నిమగ్నమయ్యేలా తోడ్పడతాయని పేర్కొంది. ఈ క్రమంలో తొలుత ‘కస్టమైజ్డ్ ఎమోజీ’ని లాంచ్‌ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. పోలింగ్‌ రోజు ఓటర్లను అప్రమత్తం చేసేలా నోటిఫికేషన్‌, రిమైండర్‌ సేవలు ప్రవేశపెడుతున్నట్లు చెప్పింది.

‘ఓటర్ ఎడ్యుకేషన్ క్విజ్’ ద్వారా ప్రశ్నోత్తరాల రూపంలో ఎన్నికలకు సంబంధించి విశేషాలు అందజేయనున్నట్లు ట్విటర్‌ తెలిపింది. ‘భారత ఎన్నికల సంఘం’ అనే డెడికెటెడ్ సెర్చ్‌ ప్రాంప్ట్‌  ద్వారా విశ్వసనీయ, అధికారిక సమాచారంతోపాటు తాజా పరిణామాలను నెటిజన్లకు చేరవేయనుంది. ‘ట్విటర్‌ ఇండియా’ పబ్లిక్ పాలసీ అండ్‌ గవర్నమెంట్‌ ప్రతినిధి పాయల్ కామత్ ఈ విషయమై మాట్లాడుతూ.. ‘ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు ప్రామాణిక సమాచారం అందజేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నాం. ఈ క్రమంలో ప్రభుత్వ భాగస్వామ్యంతో పని చేస్తాం. డెడికెటెడ్‌ సెర్చ్‌ ప్రాంప్ట్ అనేది ట్విటర్‌లో ఎన్నికల సమాచారం కనుగొనడాన్ని సులభతరం చేస్తుంది. తద్వారా అభ్యర్థుల జాబితా, ఓటింగ్ తేదీలు, పోలింగ్ కేంద్రాలు ఇతరత్రా సమాచారాన్ని చూడొచ్చు’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు